కోడుమూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాలసీలు, విధివిధానాల గురించి అడిగితే, మీరు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, గురించి పెళ్లిళ్లు గురించి దిగజారుడు మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని కోడుమూరు జనసేన పార్టీ నాయకుడు ఆకెపోగు రాంబాబు అన్నారు. మా నాయకుడు మీ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపిస్తుంటే ఆయన మీద మీ మాటల దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా మీ ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడాలంటే మా నాయకుడు మాకు సంస్కారం, విలువలతో రాజకీయాలు చేయాలని మాకు నేర్పించారు. ప్రతి ఒక్క మహిళా సోదరి సోదరిమణులుగా అని మాకు తెలియజేశారు, మా నాయకుడు మాటకు మేము గౌరవం ఇచ్చి మేము ఏమీ మాట్లాడలేకపోతున్నాం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్పాలని కోడుమూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com