కోడుమూరు ( జనస్వరం ) : గూడూరు పట్టణంలో అంగన్వాడి ఉపాధ్యాయులు, హెల్పర్లు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోసం గూడూరు పట్టణంలో జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయ బాధ్యులు ఆకేపోగు రాంబాబు సంఘీభావం తెలపడం జరిగింది. నిత్యావసర సరుకుల ధరలను సరుకులు పెరగడం వల్ల అధిక భారం పడడం వల్ల వాళ్ళ డిమాండ్లు, హెల్పర్లు ప్రమోషన్లు హామీలు కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలని వేతనం లో కూడా సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని వాళ్ళ సమస్యలు పరిష్కారించాలని కోరడం జరిగింది. అంగన్వాడి, హెల్పర్లు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని CITU, అనుబంధ యూనియన్ల ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 11వ రోజు గూడూరు నగర పంచాయతీలో ఈ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సమ్మెలో జనసేన పార్టీ కోడుమూరు నియోజకవర్గ నాయకులు వెంకట్ రాముడు, రామ, ఎల్లప్ప, విజయ, సోమేశ్ వీర మహిళా రమణమ్మ, జన సైనికులు, వీర మహిళలు సంఘీభావం తెలుపడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com