పిఠాపురం ( జనస్వరం ) : గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో స్థానికులు 40 సంవత్సరాల నుండి 370 ఎకరాల్లో కొండపోడు వ్యవసాయం చేసుకుంటూన్న దనకొండను వ్యవసాయానికి అనుకూలంగా మలుచుకుని జీడిపంటను పండించుకుంటూ జీవనాధారం పొందుతున్న వారికి అన్యాయం చేయొద్దని, వెంటనే మైనింగ్ అపి వారికి న్యాయం చెయ్యలని, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామానికి చెందిన కొండపోడు భూములకు సంబంధించి సుమారుగా 370 ఎకరాలలో 300 కుటుంబాలు గత 40 సంవత్సరాలుగా జీడి మామిడి తోటలు వేసి పండించుకుంటూ వాటి మీద జీవనాధారం పొందుతున్నారు. ఆ జీడి మామిడి తోటలు వేసుకోవడానికి కూడా ఎస్సీ కార్పొరేషన్ మరియు బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులు తెచ్చుకుని ఆ జీడి మామిడి తోటలు వేసి దాని మీదే జీవనం గడుపుతున్నారు. ఇప్పుడు అక్రమార్కులు మైనింగ్ చేయాలని ఉద్దేశంతో ఈ రైతులందరినీ బెదిరించి బయటకు పంపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులందరూ కలిసి కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ క్రమంలో స్థానికులు మాకినీడి శేషుకుమారి గారిని కలిసి వారికి మద్దతు ఇవ్వాలని కోరారు. వారికి అండగా ఉండేందుకు ఈరోజు కొడవలి గ్రామంలో దనకొండను ఆమె పరిశీలించి స్థానిక ప్రజలు, రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా దనకొండపై పోడు వ్యవసాయం చేస్తూ ఫల సాయం పొందుతూ బతుకు జీవనం సాగిస్తున్న స్థానిక 300 కుటుంబాలను ఈ వైసీపీ ప్రభుత్వం ఆ కొండను అక్రమ మైనింగ్ కి కేటాయించి వాళ్ళ పొట్ట కొట్టే చర్య చాలా దౌర్భాగ్యమైనదని అన్నారు. డబ్బు సంపాదించుకోవడానికి చాలా అనేక మార్గాలు ఉన్నాయని, కానీ ప్రజలు పొట్ట కొట్టి వాళ్ల భవిష్యత్తును నాశనం చేయవద్దని డిమాండ్ చేశారు. పర్యవరణ సమతుల్యత దెబ్బతింటుందని, కోర్ట్ లో వున్న కేస్ వుండగా, మళ్లీ మళ్లీ ఇలాంటి దుశ్చర్యకు పూనుకుంటే ఇక్కడ ధర్నా చేయడానికి అయినా వెనకాడబోనని స్థానికులకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరథి వల్లి రామకృష్ణ, నక్క నారాయణ మూర్తి, నక్కా శ్రీనివాస్(బద్రి), నేమల నాగేశ్వరావు, పలికి ప్రసాద్, గంపల రాంబాబు, గంపల వీరబాబు, నరాల సుబ్రహ్మణ్యం, నరాల సుబ్బలక్ష్మి, అంబుజలపు గంగ, గప్పల జయ, నక్కా కృష్ణ, గోకరకొండ బుజ్జి, రైతులు, గ్రామస్థులు, జనసైనికులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.