కొండేపి, (జనస్వరం) : సింగరాయకొండ ట్రంకు రోడ్డు మోకాల్లోతు గుంటలు ఏర్పడి, నిత్యం రద్దీగా తిరిగే ట్రంకు రోడ్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు విషయంపై జనసేన పార్టీ పోరాటం చేసిన విషయం తెలిసిందే. అయితే జనసేన పార్టీ పోరాటానికి, స్పందించి సింగరాయకొండ ట్రంకు రోడ్డును మరమ్మతులు చేపడుతున్న ఆర్ అండ్ బి అధికారులకు జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాక జనసేన పార్టీ పోరాటంలో భాగంగా నిరసన కార్యక్రమాన్ని, చిత్రీకరించి, ప్రచురించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా మిత్రులకు పేరుపేరునా జనసేన పార్టీ నుండి ధన్యవాదాలు తెలిపారు. సింగరాయకొండ మండలంలో ప్రజల సమస్యలపై ప్రజల పక్షాన పోరాటం చేసి పరిష్కార మార్గానికి ఎల్లవేళలు జనసేన పార్టీ సిద్ధంగా ఉంటుందని తెలియజేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com