ఆదోని ( జనస్వరం ) : ఒకరిని విమర్శించేముందు నీ స్థితి ఏమిటో తెలుసుకో... దమ్ముంటే కల్గుబావిలో ఉన్న వైసిపి కౌన్సిలర్‌ను రాజీనామా చేయించి బరిలోకి దిగు ... నేను కూడా నీతో పోటీకి బరిలో దిగుతా... బరాబరి... కల్లుబావిలో తేల్చుకుందాం... గెలుపేవరిదో.. ఓటమి, ఎవరిదో... అక్కడి జనమే నిర్ణయిస్తారు... నువ్వుసిద్ధమేనా... అని వైసిపి పట్టణ అధ్యక్షులు దేవాకు జనసేన ఐటి కోఆర్డినేటర్ మహేష్ యాదవ్ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా బుధవారం ఆదోని పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహేష్‌యాదన్ మాట్లాడారు. అధికారపార్టీ నాయకులంటే సామాన్యులకు అండగా ఉండాలని.. అలాకాకుండా నోరుంది కదా... అని ... అవాక్కులు... చెవాక్కులు పేలితే ... వింటూ కూర్చోవడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు... జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, ఆదోని నియోజకవర్గ ఇంచార్జి మల్లప్పల గురించి మాట్లాడే అర్హత విమర్శించే స్థాయి నీది కాదనేది ముందు తెలుసుకో.... ఆదోని పట్టణానికి ప్రభుత్వ డిగ్రీకళాశాల మంజూరైందని సిఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని త్వరలోనే నిర్మిస్తామని సంకలు గుద్దుకుంటున్నారే తప్ప ఇప్పటివరకు ప్రభుత్వ డిగ్రీకళాశాలకు స్థలమెక్కడు..? కళాశాల భవనం ఎక్కడ నిర్మిస్తారు..? ఎప్పుడు నిర్మిస్తారు..? అనే మాటలు స్పష్టంగా ఒక్కరైనా చెబుతున్నారా...? ఉదయం లేచినప్పటి నుండి పొద్దుమునిగే వరకు వనిగట్టకొని ఆరోపించడం, విమర్శించడం తప్ప అధికారపార్టీలో ఉండి ఏదైనా చేసి చూపించాలన్న ఆలోచన ఎందుకు లేదని ప్రశ్నించారు... ప్రతిపక్షాలు మాట్లాడితే గుమ్మడికాయ దొంగలాగా భుజాలు తడిమిచూసుకోవడం సరికాదని .. ఇలాంటి వాటికి స్వస్తి పలికి ఆరోపణలకు, విమర్శలకు గుడ్‌బై చెప్పి చేతనైతే ఉన్న అధికారంతో అభివృద్ధి చేసి శభాష్ అని మన్ననలు పొందండి .. లేకపోతే చేతకాదని పక్కకు తప్పుకోండి... అంతేగాని నోరుందని... అధికారముందని ... పిచ్చాపాటిమాట్లాడితే... సపాంచేది లేదని .. జనసేన ఐటి కోఆర్డినేటర్ మహేష్‌యాదవ్ హెచ్చరించారు. ఈ సమావేశంలో రేణువర్మ, నెలబండ్ల రాజశేఖర్, వెంకటేష్,గాజుల రాజశేఖర్, ఉరుకుందు, ప్రకాష్, చంద్రశేఖర్, ప్రలిరాజు, శ్యాం, విజయ్, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com