Logo
Date of Publish : 02 May 2023, 3:43 pm
Editor : Sake Naresh

శ్రీకాళహస్తిలో వినుతా కోటా ఆధ్వర్యంలో KNOW MY CONSTITUENCY కార్యక్రమం

     శ్రీకాళహస్తి ( జనస్వరం ) : 48 వ రోజు KNOW MY CONSTITUENCY కార్యక్రమం లో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా  శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీ లోని వీధుల్లో పర్యటించి గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించి ,జనసేన పార్టీ కి ఒక్క అవకాశం కల్పించాలని ప్రజలను కోరడం జరిగింది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నియోజకవర్గంలో, రాష్ట్రంలో జనసేన పార్టీ ముందుండి పోరాడుతున్నామని తెలియజేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజల జీవన ప్రమాణాలలో ఏ మాత్రం మెరుగు లేదని ప్రజలు తెలియజేశారు. సమస్య ఉంది అని చెప్పడానికి కూడా ఏ కేసులు పెడతారో అని భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయని వాపోయారు. అన్ని రేట్లు పెంచి , సంక్షేమం పేరుతో కొద్ది మందికి మాత్రమే మేలు చేసే కార్యక్రమాలు మాత్రమే ఈ ప్రభుత్వం నిర్వహిస్తుంది, ఏ మాత్రం అభివృద్ది లేదని ప్రజలు వాపోయారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, నాయకులు వెంకటరమణ , నితీష్ కుమార్ , జనసైనికులు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com