శ్రీకాళహస్తి ( జనస్వరం ) : నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని ప్రజా సమస్యల పరిష్కార దిశగా, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు ప్రారంభించిన “KNOW MY CONSTITUENCY” కార్యక్రమంలో భాగంగా ఏర్పేడు మండలం , చెల్లూరు అరుంధతివాడ గ్రామంలో పర్యటించడం జరిగింది. మొదటగా గ్రామంలో అమ్మ వారి దేవాలయంలో జాతర పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం కార్యకర్తలతో కలిసి గ్రామంలో పర్యటించి అక్కడి ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకోవడం జరిగింది.
ఈ క్రింది సమస్యలను ప్రజలు వినుత గారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది.
1. గ్రామంకి రాకపోకలకు బస్ సౌకర్యం లేదు: గ్రామంలో స్కూల్ కి వెళ్ళే పిల్లలు 3-4 కి.మీ నడిచి వెళ్లాలి, అత్యవసరం ఆరోగ్య సమస్య అయిన ప్రయాణించడానికి ఎలాంటి సౌకర్యం లేదు. బస్ సౌకర్యం లేక గ్రామంలో ప్రజలు 3-4 కి.మీ నడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
2. గ్రామంలో బాల్వాడి స్కూల్ లేదు, ప్రాథమిక స్కూల్ కూడా లేదు. గ్రామంలో పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి అన్న 3-4 కి.మీ పక్కన ఉన్న గ్రామానికి వెళ్లి చదువుకోవాలి. బస్ ప్రయాణ సదుపాయాలు లేక పిల్లలు 3-4 కి.మీ నడవలేక బడి మానేస్తున్నారు.
3. గ్రామంలో స్ట్రీట్ లైట్స్ లేవు.
4. స్మశానానికి దారి లేదు.
5. త్రాగునీటి కొరకు టాంక్ సౌకర్యం లేదు.
6. రైతులకు పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర దొరకట్లేదు. ప్రభుత్వం కొనుగోలు చేసే కార్యక్రమాలు అస్సలు చెయ్యటం లేదు.
7. చదువుకున్న యువతకి ఉద్యోగాలు లేవు.
గ్రామస్థుల సమస్యలను విన్న వినుత కోట మండల అధికారులు, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి సమస్యలను తీసుకుని వెళ్లి పరిష్కారం అయ్యే వరకు ప్రజల వెంట నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది.