కృష్ణా, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో సినిమా పరిశ్రమపై సినిమా వారు పడుతున్న ఇబ్బందుల గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దానికి నిన్న రాష్ట్ర మంత్రులు విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడిన దానికి మంత్రుల యొక్క తీరు మీద జగ్గయ్యపేట పట్టణంలో కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మంత్రులు నిన్న ఆదివారం కావటంతో పాపం ఒకరోజు ప్రజాసేవాకి విరామం ఇచ్చి సన్నాసి మంత్రులు అందరూ మీడియా ముందుకు వచ్చి సన్నాసి వేషాలు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఎంమాట్లాడిన, ఏం చేసినా పట్టిచ్చుకోము అని అంటుంటేనే మొన్న మా అధ్యక్షులు మాట్లాడిన దానికి ఒక్కొక్కరుగా టైం టేబుల్ వేసుకుని మీడియా ముందుకి వచ్చారు అని అందులో ముందుగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అని విజయవాడలో నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మా పోతిన మహేష్ గారు ఇస్తున్న స్ట్రోక్ కి మైండ్ బ్లాక్ అయిపోయి ఎక్కడ మంత్రి పదవికి ఎసరు వస్తాదో అని భయపడి ప్రతిసారి అవసరమైన విషయాలు తప్ప అనవసరమైన విషయాలు అన్ని మాట్లాడతారని, రాష్ట్రంలో దేవలయాలపై జరుగుతున్న దాడుల మీద స్పందించరని, దోషులను గుర్తించరని, దుర్గమ్మ గుడిలో జరుగుతున్న అవినీతి గురించి విచారణ చేపట్టరని, వీటి మీద మీరు మాట్లాడాలని ఆయన తెలిపారు. మీరు మీడియా ముందుకి వచ్చి ఎంత నటించిన మిమ్మల్ని మంత్రి పదవి నుంచి తీసేయడం ఖాయం అని ఆయన తెలిపారు. ఇంకొక మంత్రి బొత్స సత్యనారాయణ గారి గురించి కిషోర్ కుమార్ మాట్లాడుతూ బొత్స గారు మీరు పెద్ద వారు మీకు నోరు ఉంది కదా అని ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి తుత్తుతూ, తత్తాత అని మాట్లాడి మీ వాక్చ్యతుర్యాన్ని చూపించుకోదని ఆయన తెలిపారు. మంత్రి అనిల్ కుమార్ గారి గురించి మాట్లాడుతూ విషయ పరిజ్ఞానం లేని మంత్రుల్లో ముందు వరుసలో ఈయన ఉంటారని, వీధి రౌడీలు కొట్టుకుంటూ తిట్టుకుంటూ మాట్లాడితే ఎలా ఉంటదో ఈయన తీరు కూడా అంతే ఉంటదని మండి పడ్డారు. బెట్టింగులు చేసుకోక సినిమా పరిశ్రమ గురించి మీకు ఎందుకు అని ఆయన తెలిపారు. ఇంకొక మంత్రి ముఖ్యమైన మంత్రి పేర్ని నాని గారు ఈయనకి స్క్రిప్ట్ కొంచం ఆలస్యంగా వచ్చినట్టు ఉందని, ఈయన మంత్రి శాఖ గురించి ఏరోజు కూడా మాట్లాడరని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏది మాట్లాడిన పిచ్చి వాగుడు వాగడం మాత్రమే తెలుసని, కులాలు తీసుకొచ్చి కులాల ప్రస్తావనతో రాజకీయం చేస్తారని, ఒక ప్రజనాయకుడిని, ఒక కులానికి అంటగట్టి మా వాడు, మా అది ఇది అని నోటికీ వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. 2018 లో ఉన్న ఇసుక ధర 1300, 1600 ఉంటే నేడు 5000 కు పైగా మీరు అవినీతి చేసుకుని ఆముకుంటుంటే లేని తప్పు సినిమా వారు కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తే 100 రు. టికెట్ రెండు రోజులు పాటు 1000 రూ లకి అభిమానులు వారి సొంత డబ్బు పెట్టుకుని కొనుక్కుని వెళ్లి చూస్తే తప్పు ఏంటి అని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అన్ని మాటలకు మాట్లాడిన ఈ మంత్రులు వివేకానందరెడ్డి గారి హత్య గురించి మా అధ్యక్షులు మాట్లాడితే దాని గురించి ఎందుకు మాట్లాడడలేదని ఆయన తెలిపారు. మరొక్క మారు మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టమొచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఆయన ఉరుకున్న మేము చూస్తూ ఊరుకోమని జాగ్రత్తగా ఉండాలని త్వరలోనే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తరిమేసే రోజులు త్వరలోనే ఉన్నాయని ఆయన తెలిపారు.