ఖమ్మం, (జనస్వరం) : ఖమ్మం జిల్లా, రఘునాథ పాలెం మండలం, కామంచిగల్ గ్రామంలో డంపింగ్ యార్డ్ లో చెత్తను వేయడం వల్ల గ్రామంలో మనుషులకు, జంతువులకు అనేక రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకొని గత 24 రోజుల నుంచి వంట వార్పు కార్యక్రమాలు, మరియు రిలే నిరాహార దీక్షలతో గ్రామస్తులు నిరసన తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా జనసేన పార్టీ ఈ దీక్షకు సంఘీభావం తెలియజేయడమే కాకుండా దీక్షలో గ్రామస్తులతో కలిసి జనసేన పార్టీ రాష్ట్ర యువజన అధ్యక్షులు శ్రీ.వంగ లక్ష్మణ్ గౌడ్ గారు నిరసనలో పాల్గొనడం జరిగింది. గత నాలుగు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నటు వంటి మూడు గ్రామాల యొక్క సమస్యలను పరిష్కారం జరిగే దిశగా జనసేన పార్టీ రైతులకు అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. అదే విధంగా జనసేన పార్టీ ఈ యొక్క కార్యక్రమానికి మద్దతిచ్చిన సందర్భాన్ని స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే స్పందించి, ఈ రోజు దీక్ష జరుగుతున్నటు వంటి ప్రాంతాన్ని సందర్శించి దీక్షలో కూర్చున్నటు వంటి గ్రామస్తులకు నిమ్మరసం ఇచ్చి దీక్షని విరమించుకోవాలని కోరడం జరిగింది. అంతే కాకుండా ఈ డంపింగ్ యార్డును శాశ్వతంగా ఇక్కడ నుంచి తీసివేయబడుతుందని స్థానిక అధికార ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. ఇటువంటి సందర్భంగా మేము చేసేటువంటి పోరాటంలో జనసేన పార్టీ మాతోపాటు కలిసి పాలుపంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందని ,జనసేన పార్టీ అధినేత శ్రీ.పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా జనసేన పార్టీ నాయకులు, ఖమ్మం కార్పొరేషన్ నాయకులు, కార్యకర్తలు తదితురులు పాల్గొనడం జరిగింది.