ధర్మవరం ( జనస్వరం ) : జనసేన నాయకులు రాజా రెడ్డి పై దాడిని జనసేన జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్ తీవ్రంగా ఖండించారు. ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ ఖబడ్దార్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి… ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తాళలేక.. ఓటమి భయంతో జనసేనకు వస్తున్న ఆదరణను ఓర్వలేక జనసేన నాయకుల పై మీ అల్లరి మూకలతో దాడులు చేయిస్తే జనసేన నాయకులు, కార్యకర్తలు భయపడతారు అనుకుంటే మీ పొరపాటే. జనసేన అధ్యక్షులుపవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని అణువణువున నింపుకున్న జనసేన నాయకులు, కార్యకర్తలు ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదు. రానున్న ఎన్నికల్లో మీ భరతం పడతాం అంటూ జనసేన జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ ఘాటుగా స్పందించారు. ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆగడాలు రోజురోజుకు శృతి మించిపోయాయి. తిరిగి ఫ్యాక్షన్ రాజకీయాలను చేయాలన్న విధంగా ఆయన వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. సి సి ఫుటేజ్ లో స్పష్టంగా దాడి చేసిన వారు కనబడుతున్న ఇంతవరకు పోలీస్ యంత్రాంగం వారిని అరెస్ట్ చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వైసిపికి పోలీసులు పొత్తాసుగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. వైసిపి ఎన్ని కుట్రలు కుయుక్తులు దాడులు చేసిన జనసేన నాయకులు, కార్యకర్తలు ఏ మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని.. అవసరమైతే ధర్మవరంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తామన్నారు. మరొకసారి ఇలాంటి దాడులు పునరావృతమైతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వైసిపి మెడలు వంచుతామని టి.సి.వరుణ్ హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శులు రాపా ధనంజయ్, సంజీవ రాయుడు, కిరణ్ కుమార్, సిద్దు, జయమ్మ, అవుకు విజయ్ కుమార్, ముప్పూరి కృష్ణ, నగర ఉపాధ్యక్షులు జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శిలు హుస్సేన్, దరాజ్ భాష, నగర కార్యదర్శులు ఆకుల అశోక్, నాయకులు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.