
● రైతాంగాన్ని నట్టేట ముంచిన వైసిపి ప్రభుత్వం
● బాధిత రైతు కుటుంబాలకు రూ. 7 లక్షలు ఇప్పించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిదే
● మరోసారి అవాకులు పేలితే ప్రతిఘటిస్తాం
● అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి హెచ్చరిక
అనంతపురం, (జనస్వరం) : బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన రైతు భరోసా యాత్ర విజయవంతం కావడం వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. అందుకే వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. వైసిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హేయమని జనసేన జిల్లా అధ్యక్షులు టీ.సి.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఖండించారు. బుధవారం సప్తగిరి సర్కిల్ లోని జనసేన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి భవానిరవికుమార్, నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి, ఈశ్వరయ్య, రాప్తాడు నియోజకవర్గం ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళి హాజరయ్యారు.