Logo
Date of Publish : 11 February 2022, 12:46 pm
Editor : Sake Naresh

ఖబద్దార్… జనసేనానిపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు : కిరణ్ రాయల్

              తిరుపతి ( జనస్వరం ) : రాష్ట్ర సీఎం హోదాలో ఉండి వైఎస్ జగన్  దిగజారి ఓట్లు వేసి గెలిపించిన అమాయక ప్రజలతో జిత్తులమారి జిమ్మిక్కుల రాజకీయం చేయడం అవమానకరమని జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. వైకాపా నాయకులు, జనసేన పై చేసిన విమర్శలకు కౌంటర్ గా ప్రతి విమర్శల్ని సంధించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల పిఆర్సి విషయాన్ని ఆయనే లేవనెత్తుతాడు. ఆయనే పరిష్కరిస్తున్నటు ప్రకటించి ఆయనే మన్ననలు పొందేలా వ్యూహం రచించాడు. ప్రపంచంలోనే లేటెస్ట్ పాలిటిక్స్ అని ఉరకలు విసిరారు. కరోనా కష్టాల్లో ఉన్న సిని పరిశ్రమ కోసం పెద్దగా సీఎం జగన్ తో మాట్లాడడానికి తమ మెగాస్టార్ చిరంజీవి వచ్చారే గాని మంచు విష్ణు అన్నట్లు.. మా చిరంజీవి స్వప్రయోజనాల కోసం పోలేదని స్పష్టం చేశారు. తిరుపతి ఎంపీ రాయలసీమ ఎంపిగా వ్యవహరిస్తున్నారని ఓట్లు వేసి గెలిపించిన తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని నడికుడి రైల్వే ప్రాజెక్టుని గాలికి వదిలేశారని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని అని డిమాండ్ చేశారు. వైసీపీ నేత సజ్జల... చంద్రబాబు దత్తపుత్రుడిగా మా జనసేనాని విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ వ్యవస్థాపకులు రాష్ట్ర ప్రజల దత్తపుత్రుడని కొనియాడారు. వైకాపా జెండా పట్టుకుంటే మెంటల్ స్టార్ ని కూడా మెగాస్టార్ తో సమానంగా పక్కన కూర్చోపెట్టుకుంటారని దుయ్యబట్టారు. ఒక్క ఛాన్స్ తో జగన్ ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కి ప్రజలను దోచుకుంటున్నారని, జనం భయం ఆందోళన చెంది తమ నాయకులు పవన్ కు నీరాజనాలు పడుతున్నారని భవిష్యత్తు సీఎం తమ జనసేనానేనని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జిల్లాలను విడదీసి జిల్లాల వారీగా చిచ్చు పెడుతూ ముఖ్యమంత్రి జగన్నాటకం ఆడుతున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు తిరుపతి సిటీ అధ్యక్షులు రాజారెడ్డి, రాజేష్ యాదవ్, బాబ్జి, హేమ కుమార్, సుమన్ బాబు, మునస్వామి, కీర్తన, అమృత, అరుణ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com