పిఠాపురం, (జనస్వరం) : ఎండలు పెరుతున్నట్టుగానే రాజకీయ పార్టీలో విమర్శల పర్వం వాడివేడిగా సాగుతోంది. ఇటీవల కాకినాడ సిటి శాసనసభ్యులు ద్వారంపూడి చంద్ర శేఖరెడ్డి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జిల్లాలో ఎక్కడ పోటీ చేసిన అక్కడ ఇంఛార్జ్ గా ఉండి ఓడిస్తాను అనే వ్యాఖలకు జిల్లా జనసైన్యం బగ్గుమంది. ఈ వ్యాఖ్యలపై పిఠాపురం నియోజవర్గ ఇంఛార్జ్ మాకినీడి శేషుకుమారి ఆదివారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు, జనసైనికులతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కౌంటర్ కి ప్రతికౌంటర్ అన్నట్టు మీడియా సమావేశంలో నిప్పులు చెలరేగారు. ద్వారంపూడిని ఉద్దేశించి ముందు మీ రాజకీయ చరిత్ర తెలుసుకొని మా అధినేత పవన కళ్యాణ్ గారిపై వ్యాఖ్యలు చేయాలని గంజాయి గుట్కాలు ఎంత హానికరమో తెలిచి కూడా వాటిని సప్లేయ్ చేసే స్మగ్లర్లకు అండగా నిలిచిన నువ్వు మా అధినేతను ఓడిస్తారా? పేదలకు ఇళ్ల స్థలం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన మీరు మా నాయకుడిని విమర్శించే స్థాయా అని, జంగారెడ్డిగూడెంలో మీ పార్టీ వారే కాయించి అమ్మిన నాటుసారాకు బలిపసువుల్ని చేసిన మీరు మా నాయకుడు చిత్త శుద్ధి సిద్ధం తాలతో ప్రజల ముంది కొచ్చిన మా నాయకుడి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, జిల్లాలోనే కాదు ఇప్పుడే కాకినాడలోనే తేల్చుకుందా, తక్షణమే రాజీనామ చేయండి మా పార్టీ నాయకులు ముత్తా శశిధర్ గారి మీద నేగ్గి చూపించండని ద్వజమెత్తారు. ఇప్పటికైనా మా నాయకుడుపై అనుచిత వ్యాఖ్యలు మానుకొకపోతే పవన్ కళ్యాణ్ అగ్రజ్వాలలు చవి చూస్తారని మండిపడ్డారు. గతంలో మీడియా సోదరులు మీద లారీలు ఎక్కించండి అన్న మాటలు చాలా తప్పుగా మాట్లాడారు. అలాగే కార్పొరేటర్ లను బెదిరించి పక్కన కూర్చో పెట్టుకున్నంత మాత్రాన గొప్ప మనిషికారు. త్వరలోనే కార్పొరేట్ లో అందరూ జారుపోతున్నారని మీకు తొందరలోనే తెలుస్తుంది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఒక సుగాలి ప్రీతి ఏ కాదు, ఈనెల 14వ తారీఖున ఒక ఆడపడుచు అన్యాయం జరిగిందని కంప్లైంట్ ఇస్తే కనీసం కంప్లైంట్ తీసుకోకుండా ఆ ఆడపడుచు మనస్థాపం చెంది చనిపోవడం జరిగింది. అటువంటి ఆడపడుచు న్యాయం జరిగేలా చూడండి. అంతేగాని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు గుర్తుపెట్టుకోండి. ముందు ప్రజలతో ఎలా మాట్లాడాలి వారి కష్టాలు ఎలా తీర్చాలి అని తెలుసుకోండి. అలాగే భాష కూడా నేర్చుకోండి. రాష్ట్ర ప్రజల అందరూ మీకు తగిన బుద్ధి చెప్తారు. మీరు కంగారు పడకండి వచ్చే ఎన్నికల్లో మీకు సరైన గుణపాఠం చెప్తారని మరొకసారి తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళ యేలేశ్వరపు భాను, తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, సంయుక్త కార్యదర్శి చీకట్ల శ్యామ్ కుమార్, యు కొత్తపల్లి మండల అధ్యక్షులు పట్టా శివ, పుణ్యమంతుల బాబురావు, బుర్రా సూర్య ప్రకాష్, మేళం బాబి, గోపు సురేష్, దొడ్డి దుర్గాప్రసాద్, పులి శివారెడ్డి, కంద సోమరాజు, యాండ్రపు శ్రీనివాస్, రసంశెట్టి కన్యక రావు, కేతినిడి గౌరీ నాగలక్ష్మి, జ్యోతుల సందీప్, కసిరెడ్డి నాగేశ్వరరావు, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.