ఆళ్లగడ్డ, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ మూవీ ఆడియో ఫంక్షన్ లో ఒక మంత్రి గురించి చేసిన వ్యాఖ్యలకు మొత్తం మంత్రులందరూ పవన్ కళ్యాణ్ గారిని దూషించడాన్ని ఆళ్లగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య తీవ్రంగా ఖండించారు. ఆయన జనసేనపార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల సౌలభ్యం, పారదర్శకత కోసమే సినిమా టికెట్లు ఆన్లైన్ ద్వారా అంటున్న వైసిపి ప్రభుత్వం భారతి సిమెంట్ ఆన్లైన్ ద్వారా విక్రయిస్తుందా అని ప్రశ్నించారు. బూతులు మాట్లాడటం వ్యక్తులను కులాల వారిగా విభజించి ఆ కులాలకు సంబంధించిన వైసీపీ నాయకులతో తిట్టించి ఆ కులానికి సంబంధించిన నాయకులను ఇతర సామాజిక వర్గాలలో చిన్న చూపు చూసే విధంగా వైసిపి పార్టీ అవలంబిస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండించారు. కులాలుగా మతాలుగా విభజించి నాయకుల చేత బూతుపురాణం కేరాఫ్ అడ్రస్ గా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నిలిచింది అని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు కులాలని కలిపే ఆలోచన విధానంతో బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాయో వారిని రాజకీయంగా ఎదగాలని జనసేన పార్టీ స్థాపించారని తెలియజేశారు. వై ఎస్ ఆర్ సి పి లో ఉన్న కాపు నాయకులు పవన్ కళ్యాణ్ గారిని కులం పేరుతో విమర్శిస్తే మీరు ఎంతటి వారినైనా క్షమించేది లేదని హెచ్చరించారు. మంత్రులు మీకు ఇచ్చిన శాఖలతో బాధ్యతాయుతంగా పని చేయండి తప్ప పవన్ కళ్యాణ్ ని తిడితే ప్రజా సమస్యలు తీరవని తెలియజేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బలిజ కులస్తులు 50 వేల జనాభా ఉన్న బలిజలు మరియు బడుగు బలహీనవర్గాల అందరు కలిసి 90% జనాభా ఉన్న ముఖ్యంగా బలిజ కులస్తులు వార్డు మెంబర్లు, ఎంపిటిసిలు గెలిచి మురిసిపోతున్నారు అని మీరు చిన్న చిన్న పదవులు పొందిన మురిసిపోతూ మీ దగ్గరికి వచ్చిన వాళ్లకు మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన వాళ్లు కూడా న్యాయం చేయలేనప్పుడు మీకెందుకు ఆ పదవులు అని తెలియజేశారు. అత్యధిక జనాభా కలిగిన బడుగు బలహీన వర్గాలు ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా, మంత్రిగా చూడాలని జనసేన ఆశయం అని తెలియజేశారు. వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్ ని తిట్టడం పక్కనపెట్టి ఎలక్షన్లో ముందు మీరు చెప్పిన వాగ్దానాలను అమలుపరచడంలో దృష్టి పెడితే ప్రజల కష్టాలు తీరుతాయని తెలియజేశారు. వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి మీద కులం పేరుతో దూషిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వెంకటసుబ్బయ్య, ఆంజనేయులు, రాజారామ్, గుర్రప్ప, శీను, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.