Logo
Date of Publish : 04 November 2020, 4:22 pm
Editor : Sake Naresh

గ్రేటర్ వీర మహిళలతో తెలంగాణ జనసేన నేతల కీలక సమావేశం

గ్రేటర్ వీర మహిళలతో తెలంగాణ జనసేన నేతల కీలక సమావేశం

                 గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే పలు డివిజన్లకు కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేసిన తెలంగాణ నాయకత్వం సన్నాహక సమావేశాలతో బిజీ బిజీగా ఉంది. వరుసగా రెండో రోజు GHMC పరిధిలోని డివిజనల్ కమిటీలతో పార్టీ నాయకులు భేటీ అయ్యారు. మంగళవారం ప్రశాసన్ నగర్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ పరిధిలోని వీర మహిళా నేతలతో పార్టీ తెలంగాణ ఇంఛార్జ్  నేమూరి శంకర్ గౌడ్, పోలిట్ బ్యూరో సభ్యులు  అర్హం ఖాన్, ముఖ్య నేతలు  రామ్ తాళ్లూరి,  రామారావు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు  రాధారం రాజలింగంలు సమావేశమయ్యారు. GHMC ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలోకి దిగే అంశంతో పాటు వీర మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. అందుకు సంబంధించి పార్టీ నాయకత్వం మహిళా నేతలకు పలు సలహాలు, సూచనలు చేసింది. గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు తామంతా సిద్ధంగా ఉన్నట్టు ఈ సందర్భంగా మహిళా నేతలు పార్టీ నాయకత్వానికి తెలియచేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com