- రాష్ట్ర అడాక్ కమిటీ ఏర్పాటు
- తెలంగాణ గ్రామ పాలన అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గా లక్ష్మళ్ల నరసింహారావు
హైదరాబాద్, అక్టోబర్ 11 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రికార్డ్ అసిస్టెంట్ మరియు లాస్ట్ గ్రేడ్ సర్వీస్ నుండి గ్రామ పాలన అధికారులు (GPO) గా నియామకం కాబడిన ఉద్యోగుల సమస్యలపై ఆదివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ ఆవరణలో సుదీర్ఘ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో GPO లకు జరుగుతున్న అన్యాయంపై ప్రధానంగా చర్చించడం జరిగింది.
ప్రధాన డిమాండ్లు :
1. సమాన పనికి సమాన వేతనంలో భాగంగా రికార్డ్ అసిస్టెంట్ మరియు లాస్ట్ గ్రేడ్ నుండి వచ్చిన GPO లందరికీ జూనియర్ అసిస్టెంట్ స్కేల్ ఇవ్వాలి.
2.ప్రొబేషన్ డిక్లరేషన్ లో ఏర్పడిన సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలి.
3.సుదీర్ఘ ప్రాంతాల్లో పనిచేస్తున్న GPO లకు సొంత నియోజకవర్గంలో పోస్టింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించి, రాష్ట్ర స్థాయి అడాక్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి "తెలంగాణ గ్రామ పాలన అధికారుల సంఘం" గా నామకరణం చేశారు.
కొత్తగా ఎన్నికైన అడాక్ కమిటీ:
-అధ్యక్షులు: లక్ష్మళ్ల నరసింహారావు (సూర్యాపేట)
- ప్రధాన కార్యదర్శి: మహమ్మద్ ఫరీద్ (సంగారెడ్డి)
- అసోసియేట్ అధ్యక్షులు: బండారి వెంకటేశ్వర్లు (పెద్దపల్లి)
- కోశాధికారి:కూన రాజేందర్ (కరీంనగర్)
- ఆర్గనైజింగ్ సెక్రటరీ:పిట్టె శ్రీశైలం (మహబూబ్ నగర్)
- ఉపాధ్యక్షులు:సిలివేరి ప్రవీణ్ (సిరిసిల్ల), గున్నం సంతోష్ (నిజామాబాద్), తలారి గోపాల్ (వికారాబాద్), తుమ్మల శ్రీను (నల్గొండ)సహాయ కార్యదర్శులు: పి. శ్రావణ్ (పెద్దపల్లి), ఎండి రఫీ (కామారెడ్డి), కావాలి యాదగిరి (మహబూబ్ నగర్), ఎల్. హరి చరణ్ (నిజామాబాద్)కార్యవర్గ సభ్యులుగాపల్లె వెంకటేష్ (వికారాబాద్), వి. స్వామి (నల్గొండ), కావలి శివ (వికారాబాద్), కే. సంపత్ (నల్గొండ) లను ఎన్నుకోవడం జరిగింది.రాబోయే రోజుల్లో ఈ కమిటీ ప్రభుత్వంతో లాబీయింగ్ చేస్తూ, అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తీర్మానించారు.
