Search
Close this search box.
Search
Close this search box.

క్రియాశీలక సభ్యత్వాన్ని 50 రూపాయలు ఫోన్ పే ఇన్సూరెన్స్ తో పోల్చిన నీకు వ్యక్తిత్వం లేదు కేతంరెడ్డి

ఇన్సూరెన్స్

         నెల్లూరు ( జనస్వరం ) : క్రియాశీలక సభ్యత్వాన్ని 50 రూపాయలు ఫోన్ పే ఇన్సూరెన్స్ తో పోల్చిన నీకు వ్యక్తిత్వం లేదని, కేతంరెడ్డి వినోద్ రెడ్డి నువ్వు క్రియాశీలక సభ్యత్వం పోటీ చేసిన స్థానంలో కూడా వందకు మించలేదని అర్థమవుతుందని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ దయ్యబట్టారు. ఆయన మాట్లాడుతూ ఎంతో రాజకీయ అనుభవం గల నాదెండ్ల మనోహర్ గారు ఏదో ఆశించి ఉంటే అధికార పార్టీకి పోయి ఉండేవాళ్ళని అన్నారు. పవన్ కళ్యాణ్  వెంటే ఉండి నవ సమాజ స్థాపనకు పోరాడుతున్న నాదెళ్ల మనోహర్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని అన్నారు. సప్త సముద్రాలు దాటి సవిటి కాలంలో పడిపోయాడంట ఒక రాజు అట్ట ఉంది మన నెల్లూరులో పార్టీ మారిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి పరిస్థితి. స్వప్రయోజనాల కోసం వ్యక్తిగత లాభాల కోసం పార్టీ మారారు దానికి మాకేం అభ్యంతరం లేదు అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం పార్టీని వదిలి వస్తున్న వైసిపి పార్టీలో చేరారు ఆలోచించుకోవాలి. అంతటి తో ఆగి ఉంటే బాగుండేది. మా నాయకుల మీద విమర్శలు చేయడం మాత్రం తగదని అన్నారు. నువ్వే చెప్పావు పవన్ కళ్యాణ్ గారు ఆకాశం లాంటి వారు ఆకాశం మీద ఉమ్మివేయాలని చూస్తే అది మన మీదే పడుతుంది. క్రియాశీలక సభ్యత్వానికి కట్టిన 500 రూపాయల్ని ఫోన్పే లో 50 రూపాయల ఇన్సూరెన్స్ తో పోల్చినప్పుడే నీవే నీ మానసిక పరిస్థితి అర్థం అయింది. అందువల్లనే అనుకుంటా పోటీ చేసిన సిటీ నియోజకవర్గంలో 361 రోజులు తిరిగానని చెప్పుకుంటూ నువ్వు కనీసం వంద క్రియాశీల సభ్యత్వాలు కూడా చేయలేకపోయారు. అందరితో నువ్వే చెప్పావు నమ్మి సామాన్య కానిస్టేబుల్ కొడుకువైన నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని… ఇంతకీ మీ పార్టీ ఏ నియోజకవర్గంలో మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తుంది. రాజకీయానికి చాలా ఓపిక అవసరం వేచి ఉండలేక ఆత్రపడి నువ్వు పార్టీ మారడం జరిగింది.  హాస్యాస్పదం ఏంటంటే ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ గోడకు వేలాడుతుందని చెప్పడం అక్కడక్కడ ఇల్లుకి దిష్టిబొమ్మలు కట్టు ఉంటారు వాటిని చూసి జగన్ మోహన్ రెడ్డి అనుకున్నారేమో. సవాల్ చేస్తున్నాను నెల్లూరు నగర్ నియోజకవర్గంలో ఎంత మంది ఇళ్లలో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్నాయో వేళ్ళ మీద లెక్కేసుకున్దాం రండి.
          నాయకుడి ఆశయాలు నమ్మి తోడు నడవలేక పోయారు. మీరు ప్రజలు నరకయాతన పడుతుంటే అంతా వైసిపి సైడ్ ఉన్నారు అనడం మీ అమాయకత్వానికి నిదర్శనం.  నారాయణ గారిపై పెద్ద పోరాటం చేసానన్న మీరు వైసీపీ సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారిని ఎన్నిసార్లు తిట్టారు, ఆయనతో కలిసి పని ఎలా చేస్తారు.  కుల మతాలకతీతంగా పనిచేసుకుపోతున్న జనసేన పార్టీ పెద్దలని కులాల పేరుతో దూషించడం అవసరమా..?  వైసీపీ పార్టీలో చేరగానే కుల మతాలని విడదీసి చూడటం ప్రారంభించారు. మీతో నడిచిన ప్రతి ఒక్కరూ ఒకే కులానికి సంబంధించిన వారు కాకపోవడం మీరు గమనించారా.. ఏ సమస్య చెప్పినా ప్రభుత్వం ఒక రోజులో చేసి పెడుతుందన్నారు మా నెల్లూరు రూరల్ వైయస్సార్ నగర్ మరియు శ్రామిక నగర్ లో రోడ్లు లేవని దాదాపుగా ఆరు నెలల నుంచి గగ్గోలు పెడుతున్నాము. కార్పొరేషన్ లో డబ్బులు లేవు చేయలేకున్నామని చెప్పి అని అధికారులే స్పష్టం చేస్తున్నారు దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి. రోజులో మీరు ఎన్ని గంటలు రాజకీయం చేశారు నెల్లూరు నగర ప్రజలకు అందరికీ తెలుసు. సగం రాజకీయం ఎన్ని రాత్రి వేళలో ఎన్ని గంటలకి ఎక్కడ స్టార్ట్ చేస్తారో ప్రజలందరికీ గమనమే.  జనసేన పార్టీ నాయకుల్ని జనసేన ను దూషించడం మానుకుంటే మంచిది ఎలాగో మీరు ఏ నియోజకవర్గంలో పోటీ చేయలేరు కాబట్టి వారి ఆఫీస్ వర్క్ ఏదైనా ఉంటే వెనక ఉండి మీరు నిర్వహించండి.  నోరు హద్దులో పెట్టుకుని మంచి మాట్లాడితే మంచిది జన సైనికులు జనసేన నాయకులు కాపు నాయకులు మీతో గతంలో ఉండొచ్చు కానీ ఇప్పుడు ఎవరు మీకు తోడుగా నడవరని గుర్తుంచుకోండి. నా సేన కోసం నా ముందు నా ఒకరోజు శాలరీ నా జనసేనకే అని మేమంతా ఇచ్చింది ఏదో ఆశించి కాదు జనసేన పార్టీలో మాకు కూడా భాగస్వామ్యం ఉంది అని తెలియజేయడానికి అని అన్నారు. మీకు చెప్పిన అర్థం కాదు ఎందుకంటే అక్కడక్కడ మీరు పార్టీ పేరు చెప్పితీసుకున్నదే గాని మీరు పార్టీకి ఎంత ఇచ్చింది అనేది లెక్క చూసుకోగలరు. ఆరు నెలలు ముందుగానే మిమ్మల్ని పిలిపించి నారాయణకు చేయమని చెప్పానంటున్నారు ఇది ఎంతవరకు సబబు అప్పటికి ఇంకా పొత్తులే కన్ఫర్మ్ కాలేదు 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. ఇకనైనా సొంత ప్రయోజనాలు చూసుకొని మా నాయకులు జోలికి మా పార్టీ జోలికి రాకుండా ఉంటే మంచిది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, బన్నీ, వర, కేశవ, మౌనిష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way