-పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యం అంటూ ఇంటింటి ప్రచారం మొదలెట్టిన కేతంరెడ్డి
-కాబోయే సీఎం పవన్ కళ్యాణ్, అంటూ నిలువెత్తు కటౌట్ ఏర్పాటు చేసి పాలాభిషేకం చేసిన 3వ డివిజన్ జనసేన పార్టీ కార్యకర్తలు
నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యం అంటూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి చేపట్టిన పవనన్న ప్రజాబాట నేడు నెల్లూరు సిటీ 3వ డివిజన్ మైపాడు రోడ్డు వేణుగోపాలనగర్ ప్రాంతంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా 3వ డివిజన్ జనసేన పార్టీ కార్యకర్తలు కేతంరెడ్డి వినోద్ రెడ్డి నిలువెత్తు కటౌట్ ఏర్పాటు చేసి పాలాభిషేకం చేసారు. నెల్లూరు నగర క్రియాశీలక నాయకులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం కేతంరెడ్డి జాతీయ నాయకుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఇంటింటికి తిరిగే పవనన్న ప్రజాబాట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి పలు కుటుంబాలను పలుకరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే లక్ష్యంతో తాము ప్రారంభించిన పవనన్న ప్రజాబాటకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇద్దాం అని ఓటేసిన వారెవరూ ఈ సారి వైసీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు. మూడేళ్లు మంత్రిగా చేసిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చేసింది శూన్యం అని అన్నారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ ప్రజలు అనిల్ కి ఓటేశారని, 2009 లో ఆస్తులు అమ్ముకున్నానన్న అనిల్ ఇప్పుడు 500 కోట్ల రూపాయలకు పైగా అక్రమంగా సంపాదించారని విమర్శించారు. గత ఎన్నికలపుడు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అసలు తమకు పోటీయే కాదని మాట్లాడిన సీఎం జగన్ ఆనాడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడే చర్యలు చేశారని, కానీ ఇప్పుడు మాత్రం ప్రతి రోజూ పవన్ కళ్యాణ్ గారిని కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడు అని అంటున్నారని, రాష్ట్రం దాటి బయటకు వెళ్ళాలంటే తల్లిదండ్రుల అనుమతి అడిగినట్లు సీఎం జగన్ సీబీఐ అనుమతి అడగాలని, కనుక సీబీఐకి దత్తపుత్రుడు జగన్ అని విమర్శించారు. అయినా సీఎం జగన్ తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడు అని అంటుంటే రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వల్ల దగా పడ్డ ప్రతి కుటుంబం పవన్ కళ్యాణ్ గారిని తమ ఇంటి బిడ్డగా దత్తత తీసుకొంటున్నారని, ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఇంటికి దత్తపుత్రుడుగా మారారని, ఆ ప్రచారాన్ని ప్రతిరోజూ సీఎం జగన్, వైసీపీ నాయకులు చేస్తున్నారని కేతంరెడ్డి దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఇంచార్జ్ ఉయ్యాల ప్రవీణ్, ఆత్మకూరు ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్, పావుజెన్నీ చంద్రశేఖర్ రెడ్డి , ఏటూరి రవి, కాకు మురళి రెడ్డి, ఉడాలి సూర్యనారాయణ, శ్రీకాంత్, జీవన్, సంతోష్, అమంచర్ల శ్రీకాంత్, జఫర్, కుక్క ప్రభాకర్, సాయి, హేమంత్ రాయల్, ఈశ్వర్, చరణ్, వీరమహిళలు sk. ఆలియ, శిరీష రెడ్డి, ఝాన్సీ.. తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com