Search
Close this search box.
Search
Close this search box.

వైసీపీ నాయకులపై కేతంరెడ్డి వినోద్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు

కేతంరెడ్డి వినోద్

                 నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ కార్యాలయంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన పరిణామాల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పలువురు వైసీపీ మంత్రులు, నాయకులపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు వదులుతూ విమర్శించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవస్థ దెబ్బతింటోందని, నాయకుల మాటలు ఇలా ఉంటాయా అని తెగ బాధపడిపోతూ ఆళ్లగడ్డలో సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. తమ పార్టీలో ఉండే నాయకుల పరమ పవిత్రమైన మాటలను ప్రతి రోజూ వింటున్న సీఎం జగన్ గారికి పవన్ కళ్యాణ్ గారి మాటలు అంత బాధ తెప్పించాయా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బహుశా సీఎం జగన్ గారు ఈ మూడేళ్ళలో వారి మంత్రులు, నాయకులు ఇలా ఉన్నారేమో అని అనుకుంటున్నారేమో అని పలు ఉదాహరణలు వివరించారు. మాజీమంత్రి కొడాలి నాని గురించి చెప్తూ ఇప్పటి కార్పొరేట్ చదువుల్లో పిల్లలకు తెలుగు సరిగ్గా నేర్పట్లేదని, కనుక రాష్ట్రంలో ఎందరో తల్లిదండ్రులు వారి పిల్లలకు కొడాలి నాని గారి మాటల వీడియోలు చూపిస్తూ స్పష్టమైన తెలుగుని నేర్పిస్తున్నారన్నారు. ఈ రకంగా కొడాలి నాని గారు రాష్ట్రంలో ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారన్నారు. మహాత్మా పేర్ని నాని అని తెల్పుతూ బీసీ కులాల అభ్యున్నతి కోసం ఎంతో పాటు పడిన జ్యోతిరావు ఫులే గారిని మనం మహాత్మా జ్యోతిరావు ఫులే అని గౌరవించుకున్నామన్నారు. అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో నిరంతరం కాపు కులస్థుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న పేర్ని నాని గారికి మహాత్మా అనే బిరుదు ఇచ్చి గౌరవించాలని ఇప్పటికే కాపు కులం వారందరూ రాష్ట్ర వ్యాప్తంగా తమ గళాన్ని బలంగా వినిపిస్తూ ధర్నాలు చేస్తున్నారన్నారు.

         మంత్రి గుడివాడ అమర్నాథ్ గారి దెబ్బకి వైజాగ్ లో పూలమాలలు దొరకట్లేదు అని చెప్తూ మంత్రి పదవి చేపట్టిన 4 నెలల్లోనే 40 ఐటీ కంపెనీలను వైజాగ్ కి తెచ్చి 4 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత గుడివాడ అమర్నాథ్ గారిదన్నారు. మొన్న వైజాగ్ కి తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎయిర్ పోర్ట్ మొత్తం నిర్మానుష్యంగా ఉందని, ఏంటా అని ఆరా తీస్తే మంత్రి గుడివాడ తెచ్చిన కంపెనీల ముందు యువత క్యూ కట్టి ఉన్నారన్నారు. తమ అధ్యక్షుల వారికి పూలమాల కుడా జనసైనికులకు వైజాగ్ మార్కెట్ లో దొరకలేదని, కారణం ఏంటంటే రోజుకి 10వేలకు మందికి పైగా యువత పూలమాలలు కొని ఉద్యోగం వచ్చిన ఆనందంలో గుడివాడకు వేస్తున్నారని అన్నారు. చరిత్ర పుటల్లో చేరాల్సిన గొప్ప మహిళమూర్తి మంత్రి రోజక్క అని అంటూ ఈ రోజు రాష్ట్రంలో కూతుర్లు కలిగిన ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలకు అసలు మహిళ అంటే ఎలా ఉండాలి, ఎలాంటి పలుకులు పలకాలి, ఎలాంటి హావభావాలు వ్యక్తపరచాలి అనేందుకు నిలువెత్తు నిదర్శనంగా మంత్రి రోజక్క ని చూపిస్తున్నారన్నారు. ఈరోజు రాష్ట్రంలో అనేకప్రాంతాల్లో రోజక్క చరిత్రని ఒక ఝాన్సీలక్ష్మీ, రుద్రమదేవి వంటి వారి చరిత్రలాగా పుస్తకాల్లో చేర్చాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి అంటే గొప్ప విషయమే కదా అని అన్నారు. మంత్రి విడదల రజిని గురించి చెప్తూ హైదరాబాద్ లోని బీడు భూముల్లో మొక్కలు పెంచి వాటిని అమెరికాలో వృక్షాలుగా ఎలా తీర్చిదిద్దాలో మన మంత్రి విడదల రజిని గారి నుండి నేడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క యువతీయువకులు స్ఫూర్తి పొందుతున్నారన్నారు.

             మహిళల్లో అభ్యుదయం నింపే గొప్ప సంఘ సంస్కర్త మన మంత్రి అంబటి రాంబాబు అని చెప్తూ మహిళల్ని ఎలా అభ్యుదయపథంలో నడపాలో, అరగంటలో వారిలోని అంధకారాన్ని పోగొట్టి వారి జీవితాల్లో వెలుగులు ఎలా నింపాలో అనే ప్రాజెక్టు ని విజయవంతంగా రూపకల్పన చేసిన మన మంత్రి అంబటి రాంబాబు గారు నేడు ప్రపంచంలోని ఎందరో సంఘ సంస్కర్తలకు ఆదర్శనీయం అని అన్నారు. ఆరో ఎక్కం సృష్టికర్త మా బ్రో అనిల్ అని అంటూ ప్రపంచ మేధావులకు కూడా అంతుపట్టని ఆరో ఎక్కాన్ని అవలీలగా కనుక్కున్న అపర మేధావి మా బ్రో అనిల్ కుమార్ యాదవ్ అని అన్నారు. ఆరు ఒకట్ల ఆరు నుండి ఆరు ఇరవైలు నూట ఇరవై. ఆరు యాభైలు మూడొందలు అంటూ ప్రపంచ చరిత్రకు గొప్ప సూత్రాలను అందించిన గొప్ప సృష్టికర్త మా బ్రో అనిల్ అని అన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గురించి చెప్తూ శ్రీకాళహస్తిలో ప్రముఖమైన దేవాలయాల్లో ఒకటి ఆ శ్రీకళహస్తీశ్వర దేవస్థానం అయితే మరొకటి మా ఎమ్మెల్యే బియ్యం రెడ్డి గారు నిర్మించిన జగన్ రెడ్డి దేవస్థానం అని అన్నారు. వీరు బెంగళూరులో కూర్చుని స్వరపరచిన సాహో జగనన్న, జగన్ మామయ్య పాటలు నేడు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అని, పిల్లలతో ఆయన వేసే డ్యాన్స్ స్టెప్పులు ఇంకా ఫేమస్ అని అన్నారు. అందుకే ప్రతి రోజు ఆయన ఇంటి ముందు ఏ.ఆర్.రెహ్మాన్, లారెన్స్ వంటి మ్యూజిక్, డ్యాన్స్ డైరెక్టర్లు నిరంతరం క్యూ కట్టి ఉంటారన్నారు. రాష్ట్ర రీల్ స్టార్ ఎంపీ మార్గాని భరత్ అని అంటూ నేడు రాష్ట్రంలో మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్, మెగాపవర్ స్టార్, స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ ల కంటే గొప్ప స్టార్ గా ఎదిగిన కుసుమం మన రీల్ స్టార్ మార్గాని భరత్ గారు అని అన్నారు. ఎంతో మంది పిల్లలకు, యువతీయువకులకు ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ లలో రీల్స్ ఎలా తీయాలనే దానిపై నిరంతరం తర్ఫీదుని ఇస్తూ ఫాలోవర్లను పెంచుతూ, కేకులు కోసి తినిపిస్తూ వారు యువతని అభివృద్ధిపథంలోకి తీసుకొస్తున్న తీరు అందరికీ ఆదర్శప్రాయం అని అన్నారు. ఇంతటి గొప్ప గొప్ప వ్యక్తుల నుండి నిరంతరం స్ఫూర్తి పొందే మాటలను వినే సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు బాధ కల్గించడంలో ఆశ్చర్యం లేదని కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు.

               ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కులాన్ని అపాదించే ప్రయత్నం వైసీపీ వారు చేస్తున్నారని అసలు పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలకు సామాజిక న్యాయం చేస్తారు అనే దానికి తానే ప్రత్యక్ష ఉదాహరణ అని కేతంరెడ్డి అన్నారు. రెడ్డిల ప్రాధాన్యత ఎక్కువుగా ఉండే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీ కూడా ఒక్క రెడ్డి అభ్యర్థికి సీటు ఇవ్వలేదని, ఆఖరికి ఇండిపెండెంట్ లు కూడా రెడ్డిలు లేకుండా చేసి అణగదొక్కారని, కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి సామాజిక పరిస్థితులు గుర్తించి రెడ్డి సామాజికవర్గానికి చెందిన తనకు అవకాశం ఇచ్చారని, పోటీ చేసిన మొత్తం 13 మంది అభ్యర్థుల్లో తాను ఒక్కడినే రెడ్డిని అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి నీతి, నిజాయితీ ముందు ఎవ్వరూ పనికిరారని, పవన్ కళ్యాణ్ గారిపై అనవసర ప్రేలాపనలు ఎవరు చేసినా చూస్తూ ఊరుకోమని కేతంరెడ్డి వినోద్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో .. కాకు మురళి రెడ్డి, హేమంత్ రాయల్, కార్తిక్, జీవన్, జఫర్, కుక్క ప్రభాకర్, సాయి, వినయ్, చిన్న.. వీరమహిళలు.. శిరీష రెడ్డి, స్రవంతి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way