- రాష్ట్ర స్థాయి జగన్ మోహన్ రెడ్డి నుండి గల్లీ స్థాయి అనిల్ కుమార్ యాదవ్ వరకు ఎన్నికల సంవత్సరంలో శంఖుస్థాపనలు చేస్తున్నారు
- నాలుగేళ్ళలో చేయని పనులకు ఇప్పుడు శంఖుస్థాపనలు ఎవరిని మభ్యపెట్టడానికి?
- అందుకే నెల్లూరు సిటీలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిన పనులన్నింటికీ శంఖుస్థాపన చేస్తాం
- రానున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఏర్పడబోయే ప్రజా ప్రభుత్వంలో పనులు ప్రారంభించి పూర్తి చేస్తాం
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మినీబైపాస్ రోడ్డు మిలీనియం సబ్ స్టేషన్ ప్రక్కన సర్వేపల్లి కాలువపై 15వ డివిజన్ బాలాజీ నగర్ నుండి మినీబైపాస్ రోడ్డులను కలిపే వంతెన నిర్మాణానికి సంబంధించి జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ 2019 లో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం 2024 ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెట్టగానే శంఖుస్థాపనలు గుర్తుకు వచ్చాయని, రాష్ట్ర స్థాయిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎయిర్ పోర్టు వంటి వాటికి శంఖుస్థాపన చేస్తుంటే గల్లీ స్థాయిలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారు పిల్ల కాలువలకు సైడు కల్వర్టుల నిర్మాణం వంటి శంఖుస్థాపనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ఏడాదిలో ప్రభుత్వం చేసే శంఖుస్థాపనలు అసలు పనులే పూర్తికావని, అవి కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే అని 2018లో జగన్ మోహన్ రెడ్డి చెప్పారని గుర్తుచేసారు. అంటే ఎన్నికల ఏడాదిలో చేసే శంఖుస్థాపనలకు ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వమే బాధ్యత అని తెలిపారు. కనుక నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎటువంటి కనీస అభివృద్ధి కూడా చేయని వైసీపీ ప్రభుత్వంలో పెండింగ్ పనులన్నింటికీ విడతల వారీగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో శంఖుస్థాపనలు చేస్తామని, రానున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఏర్పాటు కాబడే ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడు శంఖుస్థాపన చేసిన ప్రతి పనిని ఎటువంటి ఆలస్యం చేయకుండా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు సర్వేపల్లి కాలువపై చేసిన శంఖుస్థాపనకు సంబంధించిన పని గత ప్రభుత్వంలో ఆగిపోయిందని, ఈ వంతెన నిర్మాణం పూర్తై ఉంటే కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ప్రజలకు ఈ వంతెన ఉంటే ఎంతో ఉపయోగపడేదని, మినీబైపాస్ పై ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం రోడ్డుని మూసి వేసిన సమయంలో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉపయోగపడేదని, కానీ మూడేళ్ళ పాటు జలవనరుల శాఖా మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఈ పనిని పూర్తి చేయించడం పై దృష్టి పెట్టకుండా, నగరంలో మూడు కాలువలలో రివిట్మెంట్ గోడల నిర్మాణానికి దృష్టి పెట్టి బినామీ కాంట్రాక్టుల పేరుతో వందల కోట్ల రూపాయలను అక్రమ మార్గంలో కాజేయడంపై దృష్టి పెట్టారని అన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ చేసిన తప్పులను రానున్న తమ ప్రభుత్వంలో తాము చేయమని, ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆమోదంతో ఈ శంఖుస్థాపనకు సంబంధించిన అనుమతులు తెచ్చి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, కార్తీక్, సారథి, హేమంత్ రాయల్, షేక్ జాఫర్, కుక్కా ప్రభాకర్, జీవన్, వినయ్, వరప్రసాద్, తేజ, దువకార్, పవన్, లక్ష్మణ్, నాగరాజు, సాయి, సుజన్ సింగ్, వీరమహిళలు సృజన, ఝాన్సీ, మేరీ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com