నెల్లూరు సిటీ ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 206వ రోజున 43వ డివిజన్ రాజపుట్ వీధి, పి.ఎన్.ఎం. స్కూల్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగి ప్రజాసమస్యలను అధ్యయనం చేసి పోరాడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఐదు రోజుల క్రితం ఈ నెల 2వ తేదీన నెల్లూరు నగరంలోని బోసుబొమ్మ సెంటర్ వద్ద పవనన్న ప్రజాబాట 200వ రోజు సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం లేకపోవడంతో చిత్ర పటాన్ని ఏర్పాటు చేసి పుష్పాంజలి ఘటించి ఈ సంఘటనను తెల్పడంతో హుటాహుటిన ప్రభుత్వ అధికారులు ఇప్పుడు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని, గత కొన్నేళ్లుగా విగ్రహం లేకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన వీరు ఇప్పటికైనా మేల్కొని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమం తెస్తున్న మార్పులకు ఈ సంఘటన ప్రత్యక్ష నిదర్శనం అని అన్నారు. ప్రజలందరూ తమని అపూర్వంగా ఆదరిస్తూ ఇంటింటికీ ఆహ్వానించి తమ సమస్యలు ఏకరువు పెడుతుంటే వైసీపీ ప్రభుత్వంలో వణుకు మొదలైందని, తాము లెవనెత్తుతున్న సమస్యలను అధికారులు పలు ప్రాంతాల్లో తీరుస్తున్నారని, సమస్యలు పరిష్కారం కాని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.