Logo
Date of Publish : 24 October 2022, 3:39 pm
Editor : Sake Naresh

ప్రజల మధ్యనే దీపావళి జరుపుకున్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి

          నెల్లూరు ( జనస్వరం ) : సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని 161వ రోజున 48వ డివిజన్ విరాట్ నగర్ ప్రాంతంలో నిర్వహించారు. దీపావళి పండుగ సందర్భంగా స్థానికులు పూజా ప్రసాదాలు అందజేశారు. స్థానిక పిల్లలతో కలిసి టపాకాయలు కాలుస్తూ కేతంరెడ్డి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరి జీవితాల్లో ఈ దీపావళి పండుగ వెలుగులు నింపాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాం అని అన్నారు. చెడు పై మంచి విజయం సాధించిన సందర్భానికి గుర్తుగా దీపావళి వేడుక ప్రారంభమైందని, సమాజంలో ఎప్పటికి కూడా చెడు ఎక్కువ రోజు నిలబడదని, కొంచెం ఆలస్యమైనా సరే మంచి తప్పక విజయం సాధిస్తుందని అన్నారు. ప్రజాక్షేత్రంలో నీతి, నిజాయితీ, విలువలు కూడినటువంటి రాజకీయం చేసే పవన్ కళ్యాణ్ గారికి విజయం కాస్త ఆలస్యం కావచ్చు కానీ తప్పక విజయం వరిస్తుందని, ప్రజలందరి ఆశీస్సులతో పవనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com