పిఠాపురం, (జనస్వరం) : 'ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాల్లో మనరాజ్యాంగం ఒకటి. దేశపౌరుల హక్కులను పరిరక్షించడంలో, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ను నిలపడంలో రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించింది. ఇంతటి గొప్ప రాజ్యాంగాన్ని మనకందించిన మహనీయులను స్మరించుకుందాం. రాజ్యాంగం కల్పించిన హక్కులను, స్వేఛ్ఛను, అధికారాన్ని అనుభవిస్తూ, ఆ రాజ్యాంగాన్నే ధిక్కరించడం అంటే తల్లి పాలను వెక్కిరించడమే. రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తోన్న ఇలాంటి దేశ ద్రోహులకు ప్రజలే గుణపాఠం చెప్పాలి. దేశ ప్రజలందరికీ స్వేఛ్చ, సమానత్వాలను అందించడానికి మహనీయులు రూపొందించిన రాజ్యాంగానికి సమర్థుల పాలనలోనే పరిపూర్ణత చేకూరుతుంది. రాజ్యాంగానికి న్యాయం,స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలే మూలస్తంభాలు. ఏ పాలనలో అయినా ప్రజలకు ఇవి అందని నాడు మహనీయుల త్యాగాలకు అర్థంలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొనిఉన్న ప్రజాస్వామ్య సంక్షోభాన్ని రాజ్యాంగమే సరిదిద్దగలదని ఆకాంక్షిస్తూన్నాను, నేను భారతీయుడినైనందుకు గర్విస్తున్నాను. సదా నేను భారతమాతకు రుణపడి ఉంటాను. భిన్నత్వంలో ఏకత్వాన్ని అందించిన భారతమాతకు జేజేలు. భారతీయలందరికీ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com