రాజకీయ భిక్ష పెట్టిన మెగా కుటుంబాలకు వెన్నుపోటు పొడిచిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారి దిగుడుజారుతనం ఏంటో అర్థం అవుతోందని చిట్వేలి జనసేన నాయకులు మాదాసు నరసింహ గారు అన్నారు. ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ తరఫున పోతిన వెంకట మహేష్ గారు మంత్రి గారిని ఉద్యోగాల గురించి ప్రశ్నించారు. మీరు దానికి సమాధానం చెప్పాలి అంతే కానీ, నోటికి వచ్చినట్టు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని అంటే ఊరుకోము అని కోపోద్రిక్తులయ్యారు. మీరు ఉద్యోగాలలో అవినీతి జరిగిందా? జరగలేదా? చెప్పండి. నీతి వంతులు అయితే దుర్గగుడి లో అవినీతి జరిగిందా జరగలేదా చెప్పండి. నీకు నిజంగా ప్రజల పక్షాన మీకు విశ్వాసం ఉంటే మీరు మీ నియోజకవర్గంలో కమర్షియల్ కాంప్లెక్స్ లో నీ వాటా ఎంత ? కార్పొరేటర్ లో వాటా ఎంత? వెస్ట్ నియోజకవర్గంలో కరోనా టైంలో వస్త్రలత కాంప్లెక్స్ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర మీ కమిషన్ ఎంత తీసుకున్నారు. మీకు తెలియదా మీ మేయర్ మూడు నెలలు తిరగకముందే కియా కారు ఎలా కొన్నారు. మీకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోతిన మహేష్ గారు అడిగినదానికి సమాధానం చెప్పకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. జనసేన పార్టీ నాయకులు పోతిన వెంకట మహేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com