ఆళ్ళగడ్డ ( జనస్వరం ) : జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు మైలేరి మల్లయ్య మీడియాతో మాట్లాడుతూ కర్నూలు మేయర్ బి. వై రామయ్య పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే బి. వై రామయ్య మేయర్ పదవిలో ఉండి, పవిత్రమైనటువంటి అయ్యప్ప మాలలో ఉండి పవన్ కళ్యాణ్ ను సన్యాసి, వెధవ అని సంబోధించడం అయ్యప్పమాల ధరించిన వ్యక్తి ఇలా నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడడం అయ్యప్ప భక్తుల మనోభావాలను కించపరచడం కాదా అని ప్రశ్నించారు. వ్యక్తిగతంగా దూషించడం మీకే కాదు మాకు కూడా బూతులు వస్తాయని, కానీ మా నాయకుడు ఆ సంస్కారం నేర్పించలేదని, పవిత్రమైనటువంటి అయ్యప్ప మాలలో ఉన్నారు కనుక వ్యక్తిగతంగా దూషించడానికి మా సంస్కారం అడ్డు వస్తుందని తెలియజేశారు. కర్నూలు ప్రజలు బి. వై రామయ్య ను మేయర్ గ ఎన్నుకున్నది కర్నూలు అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కరిస్తారని ప్రజలు మిమ్మల్ని కార్పొరేటర్లగా ఎన్నుకున్నది డ్రైనేజీ వ్యవస్థను, కర్నూలు సిటీ అభివృద్ధికి తోడ్పడాలి గాని పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగత దూషణల కోసం మీకు పదవి ప్రజలు ఇవ్వలేదని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల మీద ప్రజల తరఫున పోరాటం చేస్తుంటే వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు వ్యక్తిగత దూషణలతో కాలం గడిపే బదులు మంత్రులు, ఎమ్మెల్యేలు మీకు ఇచ్చిన మంత్రి పదవులను బాధ్యతాయుతంగా నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కారం దిశగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగత దూషిస్తే ప్రజా సమస్యలు తీరవని హెచ్చరించారు. 2019 ఎలక్షన్లలో మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాల్మీకిలను( బోయ) కులస్తులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారు కదా మరి వాల్మీకి లను ఎస్టీ జాబితాలో చేర్చారా? ఎప్పుడైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడిగారా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల మీద కర్నూలు సిటీ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి కానీ, బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారమే దిశగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇప్పటం గ్రామంలో రోడ్డు వెడల్పులో భాగంగా ఇల్లు కోల్పోయిన బాధితులకు ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాచంశెట్టి వెంకటసుబ్బయ్య , బావికాడి గుర్రప్ప, సజ్జల నాగేంద్ర, దూలం చైతన్య తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com