● పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయినీది కాదు
● అధికారంలో ఉండి మీరు చేయలేని సాయం మేము చేస్తుంటే ఎందుకీ ఏడుపు?
● జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాధ్
మార్కాపురం, (జనస్వరం) : జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిన తీరుపై జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మండిపడ్డారు. ఇప్పటికైనా పంథా మార్చుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. మంత్రి పదవి పోయిందని కుమిలిపోతు ఎలా అంటే అలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. అధికారంలో ఉన్న మీ పార్టీ అప్పులో ఉండి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులను ఆదుకోవాల్సీ ఉండగా మీరు స్పందించకపోతే ఆ కుటుంబాలను ఆదుకునెందుకు, ఆత్మస్థైర్యం కల్పించేందుకు ముందుకు వస్తే, ఓర్చుకోలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడితే జనసేన కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని అన్నారు. నీవు ఎమ్మెల్యేగా టీడీపీ, జనసేనలపై పోరాడుతాను అంటున్నావ్ మంత్రి పదవి పోగానే నీలో పోరాటపటిమ తగ్గిందని నెల్లూరు ప్రజలు గుర్తించారని, ఇకపై నిన్ను ప్రజలు ఆదరించారని విమర్శించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com