
కావలి ( జనస్వరం ) : కావలి నియోజకవర్గ జనసేనపార్టీ యువ నాయకుడు ఏకైక MPTC అభ్యర్థి ప్రణయ్ కుమార్ మరణించిన విషయం అందరికి విదితమే. వాళ్ల కుటుంబానికి జనసేన పార్టీ ప్రమాదపు భీమా ఇంకా అందకపోవడంతో కుటుంబం గడవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని సిద్దు గారికి తెలియజేశారు. ఆయన పిలుపు మేరకు కావలి రూరల్ జనసేన పార్టీ నాయకుడు తిరుపతి స్వామి ద్వారా ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది. తొందరగా పార్టీ నుండి ప్రమాదపు భీమా అందేలా కృషి చేసి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేశారు.