సర్వేపల్లి ( జనస్వరం ) : కార్తీక వనభోజన మహోత్సవం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో సర్వేపల్లి పంచాయతీ పరిధిలోని లింగంగుంట గిరిజన కాలనీ నందు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో గిరిజనులతో కలిసి కార్తీక వనభోజనం నిర్వహించడం జరిగింది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఏదైతే జనసేనాని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కార్తీక మాసం సందర్భంగా అట్టడుగున ఉన్న పేద గిరిజనులకి జానెడు పొట్ట నింపాలని ఆలోచనతో కార్తిక పౌర్ణమి సందర్భంగా వాళ్లకి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. అందులో భాగంగా ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంటే గిరిజనులకి కనీసం బట్టలు గాని తినడానికి తిండిగాని ఇంకా కరువుగానే ఉంది. దయచేసి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు స్వచ్ఛంద సేవా సంస్థలను ఒకటే కోరుతున్న అట్టడుగున ఉన్న పేద గిరిజనులను ఆదుకోండి. వారికి పునరావాస సౌకర్యం కల్పించండి. బిడ్డలకి మంచి చదువును అందించండి మంచి వైద్యాన్ని అందించండి. అంబేద్కర్ గారి ఆశయాలు సాధించాలన్న పేద బడుగు బలహీన వర్గానికి న్యాయం జరగాలన్న 2024లో జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తా పేద బడుగు బలహీన వర్గాలని అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కాపు సంక్షేమ సేన మహిళా వర్కింగ్ ఉమెన్స్ ప్రెసిడెంట్ గుమినేని వాణి భవాని, స్థానికులు పినిశెట్టి మల్లికార్జున్ మండల కార్యదర్శి శ్రీహరి, కాకి శివకుమార్ అస్తోటి రవి, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, తోటపల్లి గూడూరు మండల నాయకులు శరత్, అశోక్, మనుబోలు మండల నాయకులు సుబ్రహ్మణ్యం, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com