Logo
Date of Publish : 16 November 2025, 5:36 pm
Editor : Sake Naresh

కాప్స్‌ రాక్స్‌ ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాలు

నెల్లూరు, అక్టోబర్ 16, (జనస్వరం) : నెల్లూరు బలిజ భవన్‌లో ఆదివారం నిర్వహించిన కాప్స్ రాక్స్ కార్తీకమాస వనభోజనాలు ఘనంగా జరిగాయి. వేలాదిగా బలిజ సమాజం పాల్గొన్న ఈ వేడుకలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రుద్రహోమం, శివలింగాభిషేకం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిస్ఫూర్తిని నింపాయి. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ దంపతులు బలిజ భవన్ అభివృద్ధికి రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో కోటి రూపాయలు సొంత నిధుల నుంచి, మరో కోటి రూపాయలు సిఎస్ఆర్ నిధుల నుంచి విడుదల చేయనున్నట్టు తెలిపారు. సమాజ అభివృద్ధికి ఐక్యత ఎంతో కీలకమని చెప్పారు.

మునుపటి పాలనలోనే మూడు ఎకరాలు 20 సెంట్ల ప్రభుత్వ భూమిని బలిజ భవన్ కోసం కేటాయించడంతో పాటు కోటి రూపాయల ఫండ్ మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. భవిష్యత్తులో పేదల వివాహాలు, శుభకార్యాలు జరుపుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం కాప్ రాక్స్ నెల్లూరు జిల్లా అడ్మిన్ పసుపర్తి కిషోర్ ఆధ్వర్యంలో జరిగగా, బావిశెట్టి కిషోర్, గునుకుల కిషోర్, నాగళ్ళ కృష్ణ, పవన్ కుమార్, రమేష్, జగదీష్, కోటేశ్వరరావు, పీఠాధిపతి రాజరాజేశ్వరానంద స్వామితో పాటు అనేక మంది బలిజ బంధువులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com