ప్రపంచ చిరంజీవి యువసేన మరియు అఖిల కర్ణాటక పవన్ కళ్యాణ్ యువత ఆధ్వర్యంలో అక్షరమాల ఎడ్యుకేషన్ & చారిటబుల్ ఫౌండేషన్ వారికీ 100kg బియ్యం మరియు 1నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణి చేయడం జరిగింది. జనసైనికులు మాట్లాడుతూ మాది రాష్ట్రం వేరైనా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను గుండెల్లో పెట్టుకున్నామని అన్నారు. ఆయన సినిమా జీవితం, రాజకీయ జీవితం రెండు రెండు కళ్ళల్లా భావిస్తామన్నారు. అంతే కాకుండా జనసేన పార్టీ ఆశయాలను, సిద్దాంతాలను మేము నిరంతరం పాటిస్తున్నామని, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లెలా ప్రయత్నిస్తున్నామన్నారు. గత సంవత్సరం జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన జనసేవ పిలుపు మేరకు ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా మంచి కార్యాక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం, రాజేష్, దామోదర్, బాలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com