Logo
Date of Publish : 15 October 2023, 10:23 pm
Editor : Sake Naresh

కాపు ఉత్తమ విద్యార్థులకు ప్రతి ఏటా లక్ష రూపాయల స్కాలర్ షిప్

          తిరుపతి ( జనస్వరం ) : ఉత్తమ ప్రతిభ కనపరిచిన కాపు విద్యార్థులకు స్కాలర్ షిప్ కోసం ప్రతి ఏటా లక్ష రూపాయలు విరాళాన్ని ప్రకటించారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్ లో జరిగిన ఎపి కాపు టీచర్స్ వెల్పేర్ అసోసియేషన్ ప్రధమ వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. కాపులంతా ఐక్యంగా ఉంటూ చదువుకోలేని యువతీ యువకులకు ఆర్థికంగా అండగా నిలవాలన్నారు. ప్రతి ఒక్కరికీ వారి కులాన్ని ప్రేమించే హక్కు ఉందని, అలాగే ప్రతి కులాన్ని గౌరవించే బాధ్యత ఉందన్నారు. తమకంటే ఎదిగిన కులాలను ప్రేరణగా తీసుకొని అభివృద్ధి చెందాలన్నారు. తమకంటే కింది స్థాయిలో ఉన్న వారికి అండగా నిలబడి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. విద్యాదానం చేయడమనేది చాలా అదృష్టమని అందుకే ప్రతి ఏటా కాపు విద్యార్థుల చదువుల కోసం లక్ష రూపాయల విరాళాన్ని ఇస్తానని ప్రకటించారు. అంతకు ముందు ఆయన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కాపు నేతలు ఆమంచి స్వాములు, మంగబాబు, దొరరాజు, ఫణీంద్రకుమార్, నారాయణరావులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి ఆనంద్, తిరుపతి నగర కార్యదర్శి రవి, జనసైనికులు వీరామహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com