
విశాఖపట్నం ( జనస్వరం ) : ప్రజా సమస్యల కోసం నిరంతరం శ్రమిస్తున్న దక్షిణ నియోజకవర్గం నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్, కందుల నాగరాజు కు విశేష ప్రజాధరణ లబ్ధిస్తుంది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు తగ్గట్టుగా ప్రతిక్షణం ప్రజల కోసం కందుల నాగరాజు కృషి చేస్తున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తున్నారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నిత్యం నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ నేరుగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరిస్తున్నారు.