Logo
Date of Publish : 16 October 2025, 7:51 am
Editor : Sake Naresh

తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ని విమర్శించే అర్హత కందికుంటకు లేదు – వైసిపి బిసి సెల్ రాష్ట్ర కమిటీ

  అనంతపురం, అక్టోబర్ 15, జనస్వరం : రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించే అర్హతకాన్ని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ లేదని వైసిపి బిసి సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బిల్లే మంజునాథ్ విమర్శించారు. ఆయన బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కందికుంట వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాప్తాడు నియోజకవర్గం లో గత 25 ఏళ్లుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబం ప్రజలకు నిత్యం సేవలో ఉన్నారని, రాప్తాడు అనంతపురం జిల్లా రైతాంగానికి ఎన్నో మేలు చేసే కార్యక్రమాలు చేపట్టారని ఈ సందర్భంగా తెలిపారు. ఉచిత బోర్లు గొర్రెలు పంపిణీ, సాగు తాగునీరు ప్రాజెక్టులను నిర్మించి ఎన్నో చెరువులకు నీళ్లు అందించిన ఘనత ప్రకాష్ రెడ్డికి దక్కుతుందన్నారు. అలాగే నియోజకవర్గములో రైతులకు ఉచిత బోర్లు ,ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఉచిత డిష్ కనెక్షన్లు ఇలా చెప్పుకోడానికి ప్రకాష్ రెడ్డి కి చరిత్ర ఉందన్నారు. కందికుంట నీలాగానే చరిత్ర ఎన్నో బ్యాంకులను ఎగ్గొట్టి ప్రజలకు కందికుంట నీలాగానే చరిత్ర ఎన్నో బ్యాంకులను ఎగ్గొట్టి ప్రజలకు తీసుకున్న అప్పులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన చరిత్ర మాది కాదన్నారు. కంది చెనుకు ఎక్కువ కందిపప్పుకు తక్కువ నువ్వు కందికుట చెక్ బౌన్స్ వెంకటప్రసాద్ ని విమర్శించారు. ఒక్కసారి మా ప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు లేదా నీకు వైసిపిలో ఉన్న బిసి నాయకులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదన్నారు. బిసిల ముద్దుబిడ్డ బీసీలను రాజకీయంగా ముందుకి తీసుకొచ్చిన ఘనత ఒక్క తోపుదుర్తి కే దక్కుతుందని తెలిపారు. నియోజకవర్గములో జరుగుతున్న విషయాలు గురించి ప్రశ్నించి నిజాలు మాట్లాడితే ఎక్కడో ఉన్న నీకు ఉలుకెందుకు అయ్యా నీకు
గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎగరేసినట్టు నీకు ఉలిక్కిపాటి ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఒకరిని విమర్శించే ముందు నీ చరిత్ర కూడా తెలుసుకోవాలని హితువు పలికారు. రానున్న 2029 లో నీలాంటి వారికి తగిన గుణపాఠం బుద్ది క్రమశిక్షణ అభివృద్ధి అన్నిటికీ సమాధానం చెబుతామన్నారు. ముందుంది ముసల పండుగ జరబద్రం చెక్ బౌన్స్ ప్రసాద్ అని గట్టిగా మంజునాథ్ హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com