శ్రీకాకుళం జిల్లా కంచరాం గ్రామ ప్రజలందరి సమస్యల పరిష్కారం కొరకు జనసేన పార్టీ జన సైనికులు గ్రామ పంచాయితీ సెక్రటరీ గారికి వినతి పత్రాన్ని అందించి ఆ సమస్యలను వీలయినంతగా తీర్చమని కోరారు. జనసేన నాయకులు మాట్లాడుతూ కంచరాం నుండి దోసరి గ్రామం వరకు మెయిన్‌రోడ్డు వేయాలని కోరారు. గ్రామంలో యువతకు, పెద్దలకు చదువుకోవడానికి గ్రంథాలయ భవన నిర్మాణం చేయాలని కోరారు. గ్రామంలో త్రాగునీరు సమస్య ఎక్కువగా ఉందన్నారు. వీలయినంతగా పరిష్కరించాలని కోరారు. మురుగు నీరు ఎక్కువ పారడం వలన దోమలు ఎక్కువ అవుతున్నాయని కాలువలు సమస్యలు తొలగించాలి. గ్రామంలో బెల్ట్షాపులుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళల కోసం సువిధ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయాలి. గ్రామంలో రక్తదాన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తద్వారా యువత రక్తదానం చేసేలా ప్రోత్సహించాలని కోరారు. సచివాలయ ఉద్యోగులు గ్రామానికి జవాబుదారీతనంగా వ్యవహరించాలని అన్నారు. గ్రామాభివృద్ధి కొరకు యూత్మీటింగ్లు మరియు గ్రామసభలు నిర్వహించాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కొరకు వీలైనంత వేగంగా కృషి చేయాలని అదే విధంగా వాక్సినేషన్ సర్వే త్వరగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com