Logo
Date of Publish : 09 October 2020, 9:48 am
Editor : Sake Naresh

జగనన్న విద్యాకానుకపై నిప్పులు చెరిగిన కువైట్ జనసైనికుడు కంచన శ్రీకాంత్

జగనన్న విద్యాకానుకపై నిప్పులు చెరిగిన కువైట్ జనసైనికుడు కంచన శ్రీకాంత్

           ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  స్కూల్ విద్యార్థులకు అందించే  జగనన్న విద్యాకానుకపై కువైట్ జనసైనికుడు కంచన శ్రీకాంత్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వ పథకాలకు తమ వ్యక్తిగత పేర్లు పెట్టుకోవడం బాధాకరం అయితే, ఇచ్చే వస్తువులకు కూడా తమ పార్టీ రంగులు వేసుకోవడం చూస్తుంటే వారి అభద్రతా భావం కనిపిస్తోంది అన్నారు. చిన్న పిల్లలకు ఇచ్చే విద్యా వస్తువులు మీద మీ పేర్లు, పార్టీ రంగులు వేసుకోవడం సిగ్గు చేటు అన్నారు. కొందరు వైసీపీ నాయకులు మాట్లాడటం చూస్తూంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారే మొట్టమొదటగా విద్యని అందిస్తున్నట్టు చెప్పుకోవడం హాస్యాస్పదం. మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు విద్యా హక్కు అని ఈ నాయకులకు తెలియకపోవడం మన దౌర్భాగ్యం. చిన్న పిల్లల మెదడులో ఇప్పటి నుంచే వారి పార్టీ రంగులు, నాయకుల పేర్లు పలికించేలా చేయడం దారుణం అన్నారు. గతంలో రోజా గారు మాట్లాడుతూ చంద్రబాబు గారు చేసిన పబ్లిసిటీ పిచ్చిని విమర్శించిన రోజా గారికి తమ పార్టీ వాళ్ళు చేస్తున్న పిచ్చి పబ్లిసిటీ కనిపించడం లేదా ? రోజా గారు అన్నట్లే వాళ్ళ నాన్న ఆస్తిలో నుంచి తీసుకొని పథకాలు ఇస్తున్నారా, శవాల మీద చిల్లర ఏరుకునే పనులు అని విమర్శించిన నాడు, నేడు చేసే పనులు కనిపించకపోవడం శోచనీయం అన్నారు. అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ తమ పేర్లు ప్రజల్లో నానకపోతే తరువాత పట్టించుకోరని అని విమర్శలు చేసినారు. మరి ఇపుడే వాళ్ళ పార్టీ వాళ్ళే ఇలాంటి పిచ్చి పబ్లిసిటీ చేయడం చూసి ప్రజలు నవ్వుతున్నారన్నారు.  పథకాలకు జాతీయ నాయకుల పేర్లు పెట్టడానికి వీరికి ఎందుకు మనసు ఒప్పడం లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com