పాడేరు ( జనస్వరం ) : జనసేనపార్టీ నాయకులు గ్రామ పర్యటనలో భాగంగా జి.మాడుగుల మండలం కంబలబయలు, మాదే మామిడి గ్రామాలను సందర్శించారు. ఈ సందర్బంగా తల్లే త్రిమూర్తులు, మసాడి భీమన్న ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా జనసేనపార్టీ పాడేరు ఇన్చార్జ్ డా..గంగులయ్య పాల్గొన్నారు. స్థానిక గ్రామస్తులతో సమావేశమయ్యారు ప్రస్తుతం గిరిజన ప్రజలను అనేకరకాలుగా మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరుని తెలియజేసారు. పాడేరు జనసేనపార్టీ ఇన్చార్జ్ డా..వంపూరు గంగులయ్య మాట్లాడుతూ ఇంకోసారి ప్రభుత్వ ప్రతినిధులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని వారి దోపిడీ రాజకీయ విధానానికి వ్యతిరేకించి ప్రతి ఒక బాధ్యతగల గిరిజనుడు వ్యతిరేకించాలన్నారు. ఇంకో దఫా అధికారం కోసం ప్రభుత్వం చేస్తున్న ఎత్తుగడలు మోసం లో భాగంగానే ఈ నెల 21 వతేదీన చింతపల్లి వచ్చారని గిరిజన ప్రజలు అమాయకులని వారిని మభ్యపెట్టడం చాలా తేలికైన పని అనుకుంటున్నారన్నారు. అనేక రకాలుగా గిరిజనప్రజలను అన్నిరంగాల్లో ఉన్న కర్షక, కార్మికులను మోసం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసి ఇంకోసారి అధికారం ఇవ్వాలని అడగటం వారి కుతంత్ర రాజకీయాలకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. ఈ సారి వచ్చే ఎన్నికల్లో ప్రజలందరు కలిసి తమ ఓటుతో రాష్ట్రానికి పట్టిపీడిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని మార్చెయ్యలని లేదంటే భవిష్యత్ తరాలకు భవిష్యత్ లేకుండా పోతుందన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా సీఎం ని మార్చేస్తారని వైసీపీ ఇంటికి సాగనంపే రోజులు దగ్గర పడ్డాయన్నారు. మేము జనసేనపార్టీ తరుపున గ్రామ పర్యటన చేస్తున్నామని పారదర్శక విలువలున్న రాజకీయాలే మా మొదటి ప్రాధాన్యతగా మన గిరిజన గ్రామాలకు రాజకీయ చైతన్యం కలిగిస్తున్నామన్నారు. పాడేరు నియోజకవర్గ సంయుక్త కార్యదర్శి కిల్లో రాజన్ మాట్లాడుతూ ప్రజల్లో పవన్ కళ్యాణ్ నిజాయితీ ఏమిటో తెలుసని తన కష్టార్జితంతో ఎంతో మంది కౌలు రైతులకు, ప్రకృతి విపత్తులకు నష్టపోయిన ప్రజలను ఆదుకున్నారన్నారు. ఈ సందర్బంగా జనసేనపార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి మాదే మామిడి,కంబలబయలు మూకుమ్మడిగా జనసేనపార్టీ లో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో సంయుక్త కార్యదర్శి కిల్లో రాజన్,జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, తల్లే త్రిమూర్తులు, ఉపాధ్యక్షులు సాగెని ఈశ్వర్రావు, చింతపల్లి మండల అధ్యక్షులు వంతల బుజ్జిబాబు, శ్రీను, బూత్ కన్వీనర్ భానుప్రసాద్ కొర్ర, పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com