Logo
Date of Publish : 10 November 2025, 6:05 pm
Editor : Sake Naresh

కళ్యాణదుర్గం మున్సిపల్ కొత్త చైర్మన్ బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం

కళ్యాణదుర్గం, నవంబర్ 10, (జనస్వరం) : కళ్యాణదుర్గం మున్సిపల్ ఇంచార్జ్ చైర్మన్ గా హరిజన తిమ్మప్ప బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమం ఈరోజు ఉదయం మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కళ్యాణదుర్గం కూటమి MLA అమిలినేని సురేంద్రబాబు సహకారంతో ప్రభుత్వం ఇటీవల హరిజన తిమ్మప్పను అధికారికంగా ఇంచార్జ్ చైర్మన్ గా నియమించింది. గతంలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్న తలారి రాజ్ కుమార్ ప్రజలకు తాగునీరు, పారిశుధ్యం, వీధి లైట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించడంలో విఫలమయ్యారని, మున్సిపల్ సమావేశాలను నిర్వహించకపోవడంతో ప్రభుత్వం ఆయనను పదవి నుండి తొలగించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్ గా ఉన్న హరిజన తిమ్మప్పను ఇంచార్జ్ చైర్మన్ గా నియమించారు. తిమ్మప్ప తన నూతన బాధ్యతలను కళ్యాణదుర్గం టిడిపి, జనసేన నాయకుల సమక్షంలో స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వై.పి.రమేష్, జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్, జనసేన నాయకులు గంగరాజు, రుహుల్ల, సురేష్, శంకర్, జనసేన వీరమహిళలు కల్పన, మమత, టిడిపి నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com