
కళ్యాణదుర్గం ( జనస్వరం ) : ప్రజలలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక సీబీఐ దత్తపుత్రుడు జగన్ మోహన్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేయడం ఆయన అవివేకానికి నిదర్శనం అని అన్నారు. నిజంగా రైతులకి ఈ సీబీఐ దత్తపుత్రుడు అంత మేలు చేసుంటే తన సొంత జిల్లా కడపలో 130 మందికి పైగా రైతులు ఎలా ఆత్మహత్య చేసుకున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, జనసేన నాయకులు జాకీర్, వంశీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన సీబీఐ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రజలలో ఆదరణ పెరుగుతోందని గ్రహించి పదేపదే నిరాధార ఆరోపణలు చేస్తూ దత్తపుతృడనడం సిగ్గుచేటు అన్నారు. అధికారంలో ఉండి కూడా ప్రభుత్వం చేయలేని గొప్ప పని ఆత్మహత్య చేసుకున్న 3 వేల రైతు కుటుంబాలకు దాదాపు 30 కోట్ల రూపాయలు మా అధ్యక్షులవారు ఇస్తుంటే అది చూసి ఓర్వలేక ఉన్నారన్నారు. ఈ సీబీఐ దత్తపుత్రుడు 2019 ఎన్నికల్లో చెప్పిన అబద్ధాలని పదే పదే చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేశారన్నారు. అబద్ధపు మాటలతో ఇప్పుడు కూడా ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని కానీ మా నాయకునికి ప్రజలలో ప్రేమ విశ్వాసం ఉందని రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం ఆలోచించే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారని అన్నారు. రాబోయే ఎన్నికలలో జనసేన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా స్థాపిస్తామని తెలియజేశారు.