Logo
Date of Publish : 26 November 2022, 4:53 pm
Editor : Sake Naresh

డంపింగ్ యార్డ్ ను మార్చాలని కళ్యాణదుర్గం జనసేన నాయకులు ఆందోళన

       కళ్యాణదుర్గం ( జనస్వరం ) : కళ్యాణదుర్గం పట్టణంలో ముదిగల్లు రోడ్డు బైపాస్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కళ్యాణదుర్గం పురపాలక సంఘం ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ వల్ల పక్కన ఉన్న వ్యవసాయ భూములకు పంట నష్టం జరిగే విధంగా ఉందని రైతులు వ్యతిరేకించారు. ఈ సమస్య పరిష్కారానికి జనసేన పార్టీ మద్దతు మాకు కావాలని రైతులు తెలియజేయడం జరిగింది.. అందువలన ఆ డంపింగ్ యార్డ్ ను జనసేన నాయకులు భూములను పరిశీలించడం జరిగింది. డంపింగ్ యార్డ్ మార్చాలని రైతులు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. కోర్టు తీర్పు రైతులకు అనుకూలంగా వచ్చిన కూడా డంపింగ్ యార్డ్ ను మార్చకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రైతులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు చాలపాడి రమేష్, జనసేన వీర మహిళా షేక్ తార, జనసేన నాయకులు ముక్కన్నా, జాకీర్, కుందుర్పి మంజునాథ్, హర్ష, మహేష్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com