కళ్యాణదుర్గం, అక్టోబర్ 16, (జనస్వరం) : స్టేట్ ఇరిగేషన్ జనసేన డైరెక్టర్‌గా నియమితులైన పత్తి చంద్రశేఖర్‌ను కళ్యాణదుర్గం నియోజకవర్గ జనసేన నాయకులు ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గ ఇంచార్జ్ అయిన చంద్రశేఖర్ నియామకాన్ని పురస్కరించుకుని ఈ సన్మాన కార్యక్రమం శనివారం నిర్వహించారు. నవంబర్ 18, 19 తేదీల్లో పుట్టపర్తి ప్రాంతంలో జరిగే శ్రీ సత్యసాయి బాబా 100 ఏళ్ల జయంతి వేడుకల సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటనపై ఈ సందర్భంగా నేతలు చర్చించారు. పర్యటన ఏర్పాట్లు, స్థానిక ప్రమాణాలు, కార్యక్రమ నిర్వహణపై కీలక సూచనలు పంచుకున్నట్టు సమాచారం. ఆ తరువాత చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన తేనేటి విందులో కళ్యాణదుర్గం జనసేన నాయకులు పాల్గొన్నారు. పార్టీ తరఫున ఇంచార్జ్ బాల్యం రాజేష్, సీనియర్ నేతలు గంగరాజు, VH.రాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు.