Logo
Date of Publish : 24 November 2025, 4:15 pm
Editor : Sake Naresh

కళ్యాణదుర్గం నియోజకవర్గ జనసేన పార్టీ ప్రత్యేక సమావేశం

కళ్యాణదుర్గం, అక్టోబర్ 24, (జనస్వరం): మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం మరియు అనంతపురం జిల్లా జనసేన కార్యాలయం ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ రోజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి జనసేన POC బాల్యం రాజేష్, జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య హాజరయ్యారు. ఇటీవల మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగిన “సేనతో సేనాని” సమావేశానికి హాజరైన టీమ్‌లోని వి.హెచ్. రాయుడు, గంగాధర ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. జనసేన కేంద్ర కార్యాలయం సూచనల మేరకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేసే అభ్యర్థుల స్థానాలపై చర్చించారు. త్వరలో ప్రకటించబోయే మండల కమిటీల రూపకల్పన, క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమాలపై కూడా విస్తృతంగా సమీక్ష జరిగింది. రాబోయే ఎన్నికలకు కళ్యాణదుర్గం జనసేన నాయకులు, వీరమహిళలు, జనసేనికులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సభ్యత్వ నమోదు, మండల కమిటీలు, స్థానిక సంస్థల పోటీపై సమిష్టిగా పనిచేయాలని నాయకులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com