కాకినాడ రూరల్ సూర్యారావు పేట గ్రామములో 25 సంవత్సరాలుగా నివసిస్తున్న పేదల ఇళ్లను ఎటువంటి పట్టాలు లేకుండా వైసిపి ప్రభుత్వం దౌర్జన్యంగా ఖాళీ చేయించాలని చూస్తుంది. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మీకు పట్టాలు ఇస్తాం మీరు ఇప్పుడే ఖాళీ చేయండి అని హెచ్చరిస్తుంది కానీ అక్కడ ఉండే ప్రజలు మాకు మేము నివసిస్తున్నటువంటి ప్రదేశంలోనే పట్టాలు కావాలి. అలా పట్టాలు సర్వే నెంబర్ తో సహా ఇస్తే మేము ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అని చెబుతున్న ప్రభుత్వం వారి విజ్ఞాపనను పట్టించుకోకుండా, మీరు వెళ్తున్న పనుల్లో నుంచి మిమ్మల్ని తొలగిస్తాం, ప్రభుత్వ పథకాలు మీకు వర్తించేలా చెయ్యం అని చెప్పి దౌర్జన్యంగా ఖాళీ చేయించాలని చూస్తోంది అని స్థానిక జనసైనికులు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పంతం నానాజీగారి దృష్టికి తీసుకురాగ, ఆయన జనసైనికులతో కలిసి సూర్యారావు పేట ప్రాంత వాసులను కలవడానికి అక్కడకి వెళ్లి వారికీ తగిన న్యాయం జరిగేలా చేయండి అని రెవిన్యూ అధికారులతో మాట్లాడి సమస్యని సానుకూల పరిచి, MRO గారిని కలిసి ప్రభ్యుత్వం ఇచ్చే పట్టాలపై సర్వే నెంబర్ వేసి ఇవ్వాల్సిందిగా వారిని కోరడమైనది. వారు సానుకూలంగా స్పందించారని జనసైనకులకు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసైనికులు సోదేముసలయ్య, మల్లె భాస్కర్, సురేష్, రామకృష్ణ, మరియు ప్రసాద్ బాబు, కొండలరావు, దాసరి శివ, పోసిన రాము, యాళ్ల పండు, బి.మురళి, నక్క మల్లి, B.గంగాధర్, బస్స చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.