కైకలూరు, ఏప్రిల్ 02 (జనస్వరం) : మొన్న జరిగిన ఆత్మీయ సమావేశంలో బి వి రావు పార్టీ విధానాన్ని, అధినాయకుడి నిర్ణయాన్ని తప్పుపడుతూ మాట్లాడినా మాటలను జనసేన పార్టీ తరుఫున ఖండిస్తున్నాము. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడుతున్న వారెవరికి కూడా నువ్వు గుర్తింపు ఇవ్వకపోగా కనీసం అందరితో మాట్లడిన దాకలాలు లేవు. 2019 ఎలక్షన్ కి పార్టీలో చేరిన నువ్వు పవన్ కళ్యాణ్ నిన్ను గౌరవించి అభ్యర్దిగా ప్రకటిస్తే కనీసం సరిగ్గా ఎలక్షన్ చేయకపోగా, పార్టీ పరాజయం పొందిన తరుణంలో నువ్వు ఎక్కడకి వెళ్లిపోయావ్? గత నాలుగు సంవత్సరాల నుండి కనీసం బయటకి రాకుండా ఎలక్షన్ దెగ్గరికి వస్తుంది అని హడావిడి చేసేసి బ్యానర్లు కట్టేస్తే సరిపోతదా, జనసైనికులపై అధికార పార్టీ నాయకులు కేసులు పెడుతున్న సమయంలో నువ్వు ఏమైపోయావ్? అయినా సరే పార్టీ నిన్ను గౌరవప్రాదమైన పదవులలో ఉంచింది గాని ఏ రోజు కూడా అగౌరపారచలేదు. ఇవన్నీ మర్చిపోయి అధికార పార్టీ నాయకులతో చేతులు కలిపి మీ వెనక తిరిగే వాళ్ళని అధికార పార్టీలోకి పంపి నీకు దారి ఏర్పాటు చేసుకుంటున్నారు అనే విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీరు నిజమైన జనసేన పార్టీ నాయకులు అయితే అధినాయకుడు నిర్ణయానికి కట్టుబడి కైకలూరు నియోజకవర్గం సీట్ ఎవరికి ఇచ్చినా గెలిపించి పవన్ కళ్యాణ్ కి బహుమతిగా ఇస్తాను అనకపోగా మీరు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. నీకు దమ్ము దైర్యం ఉంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి అని సవాల్ విసిరారు. నీవు గనుక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 1000 ఓట్లు కూడా రావని తెలుపుతున్నాము.
అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎంతమంది అభ్యర్థులు నిలబెట్టారు ఎంతమంది అభ్యర్థులకు సపోర్ట్ చేశారు అనేది చూస్తే జీరో అని, పార్టీ సిద్ధాంతాలలో ఒకటైన కులాలను కలిపే ఆలోచన విధానంలో పార్టీ తరపున నియోజకవర్గం ఎమ్మెల్యే సీట్ బీసీ లకు కేటాయించినా మీరు పార్టీని ఎక్కడ బలోపేతం చేయకపోగా మాలో మాకు గొడవలు పెట్టి ఈరోజు అధికార పార్టీ నాయకులతో చేతులు కలిపి మా అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయాలను తప్పుబడితే సహించేది లేదని తెలిపారు. నువ్వు చేస్తున్న తప్పదు పనులను చూసి చూసి నియోజకవర్గం నాయకులు గాని జనసైనికులు గాని ఎవరు కూడా తిరగట్లేదు అని నిన్ను అసలు లెక్కేచేయాట్లేదు అనే విషయం తెలుసుకోవాలి. ఎన్నికలు సమయానికి హడావిడి చేసే నీ లాంటి వ్యక్తులు అసలు నాయకుడే కాదని, నీవు పార్టీ పేరుతో పైకి వచ్చావ్ గాని నీ వల్ల పార్టీ కనీసం ఇంచు కూడా కైకలూరు నియోజకవర్గం లో ఎదగలేదని, నీవు ముసుగు తొలిగించి త్వరలో నువ్వు నీ జగన్ రెడ్డి కండువాను మనస్పూర్తిగా కప్పుకొని నీ పని నువ్వు చేసుకోవాలని, మరలా నువ్వు గాని జనసేన పార్టీ పైన, పవన్ కళ్యాణ్ గారిపైన, నాదెండ్ల మనోహర్ గారిపైన గాని తప్పుగా మాట్లడితే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడకి వచ్చి తగిన బుద్ది చెబుతాం అని తెలుపుకుంటున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అదేశాలు మేరకు జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయిన డా.కామినేని శ్రీనివాస్ రావుకే జనసేన పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని, నియోజకవర్గం మొత్తం అందరం అధినేత పవన్ కళ్యాణ్ మాట శిరసావహిస్తు కామినేని శ్రీనివాస్ తో నడుస్తున్నామని వ్యతిరేకించింది నువ్వు ఒక్కడివే అని తెలుపుకుంటూ, జనసేన పార్టీ నాయకులు జనసైనికులు అందరం ఒకే తాటిపై భారీ మెజారిటీతో ఉమ్మడి అభ్యర్థి శ్రీ కామినేని శ్రీనివాస్ రావునీ గెలిపిస్తున్నామని ప్రెస్ నోట్ ద్వారా తెలియచేస్తున్నాము.ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గం ఐటీ కోఆర్డినేటర్ కడిమి శివ బాబు, ముదినేపల్లి మండలం ఐటీ కోఆర్డినేటర్ సుదాబత్తుల సాయిష్, కలిదిండి మండలం ఐటీ కోఆర్డినేటర్ చిట్టురి సురేష్, మండవల్లి మండలం ఐటీ కోఆర్డినేటర్ చందు కృష్ణ ప్రసాద్, కైకలూరు నియోజకవర్గం ఐటీ కోఆర్డినేటర్ వదుపు రాజేష్, నియోజకవర్గం ఐటీ సభ్యులు పేపకాయల మౌళి, అల్లాడి ఆంజనేయులు, పాడబొక్కల రవి, నియోజకవర్గం నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com