Search
Close this search box.
Search
Close this search box.

దేవాలయాల ఆస్తులను వదలని కదిరి వైసీపీ ఎమ్మెల్యే : కదిరి జనసేన ఇంచార్జ్ భైరవ ప్రసాద్

భైరవ ప్రసాద్

         కదిరి ( జనస్వరం ) : తిమ్మమాంబ దేవాలయాన్ని తర తరాలుగా ఆ గ్రామస్థులు కుల దైవంగా భావించి స్వఛ్చందంగా భూములు ఇచ్చి ఆలయ అభివృద్ది కోసం తామే స్వయంగా విరాళాలు సేకరించి అభివృద్ది చేసుకుంటున్నారు అక్కడి గ్రామ ప్రజలు. ఇదే అదునుగా భావించి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు గ్రామ కమిటీని కానీ, గ్రామ సర్పంచ్ కి కానీ, గ్రామ ప్రజలకు కానీ ఏటువంటి సమాచారం అందించకుండా నియంతృత్వ ధోరణితో స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తమ కార్యకర్తలకు కమిటీలో స్థానం కల్పించి ఆలయ అభివృద్ధికి కేటాయించే నిధులను దోచుకోవాలనే ఒక దురుద్దేశంతో ప్రశాంతంగా అమ్మవారికి నిత్యం పూజలు, భజనలు దూప దీప నైవేద్యాలు జరుపుకుంటున్న వారి మధ్య రాజకీయ కుట్రతో వారి ఐక్యతను దెబ్బతీయాలని తిమ్మమ్మ మర్రిమాను శ్రీ తిమ్మమ్మ – బాల వీరయ్య ల దేవాలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి తీసుకున్నాం అంటూ ఒక కొత్త డ్రామాకు తెర తీశారు స్థానిక ఎమ్మెల్యే. కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అక్కడ ఉన్నారని భవిష్యత్తులో రాజకీయంగా వీరికి ఇబ్బంది కలుగుతుందని భావించి బలిజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పతున్నారా…!! అనే విధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే తీరు ఉందని మా తిమ్మమ్మ మర్రిమాను ఆలయం చుట్టూ 8.5 ఏకరాలలో ప్రభుత్వానికి సంబందించిన ఒక సెంటు భూమి కూడా లేదు అంతే కాకుండా ఆలయ పునర్నిర్మాణం కూడా M.S. రామయ్య కుటుంబ సభ్యులు, అమర నారాయణ ట్రస్ట్ ( కైవారం) వారు నిర్మించడం జరిగింది అలాగే ఇప్పటికీ పూజరులకు, గైడ్ కు జీతాలు ఇస్తున్నది కూడా వారే.
            ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మీ ఆలయాన్ని 2013 వ సంవత్సరంలోనే దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉందని గ్రామస్థులకు ఏటువంటి సమాచారం అందించకుండా చాలా తెలివిగా స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతోంది. ఆలయ స్వాధీనం చేసుకుని కేవలం తమ పార్టీ నాయకులకు పదవులు కట్టబెట్టాలని చూస్తున్నారు. 2013 వ సంవత్సరంలోనే ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వెల్లినట్లైతే మీరు ఇంతరకూ ఇక్కడ నిత్యం పూజలు నిర్విహిస్తున్న పూజారులకు,తిమ్మమ్మ మర్రిమాను శ్రీ తిమ్మమ్మ చరిత్రను అమ్మవారి ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆమె జీవిత చరిత్రను తెలుపుతున్న గైడ్ కు జీతాలు ఇచ్చారా…! అని కదిరి నియోజక వర్గం జనసేన పార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్ గారు మీడియా ముఖంగా తెలపడం జరిగింది.
        మీకు రాష్ట్ర ప్రజలు అధికారాన్ని కట్టబెట్టింది వారి సమస్యలను పరిష్కరించడం కోసం మాత్రమే కానీ వారిపై పెత్తనం చెలాయించడం కోసం కాదని కదిరి ప్రాంత అభివృద్ధికి కృషి చెయ్యాలని గ్రామప్రజల, భక్తుల మనోభావాలు, హిందూ ధర్మానికి, ఆచార కట్టుబాట్లు దెబ్బతినేలా మీ ఇష్టానుసారంగా చేస్తాం అంటే ఊరుకునేది లేదు. గ్రామస్థుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ తిమ్మమ్మ ఆలయ కమిటీ సభ్యులకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని అలా కానీ పక్షంలో జనసేన పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకొని వెళతామని తెలిపారు. 2019 వ సంవత్సరంలో శ్రీ మధ్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొనేరును అభివృద్ది చేస్తాం అని 2.14 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేపించుకోని కొనేరును ఏమాత్రం అభివృద్ది చెయ్యకుండా కాలయాపన చేస్తూ నేటికీ కోనేరు అలాగే ఉంది నిధులు మాత్రం మాయం అయిపోయాయి స్థానిక నేతల జేబుల్లోకి అధికారుల ఖాతాల్లోకి చేరిపోయాయి. 3 సంవత్సరాల కాలం గడుస్తున్నా ఇప్పటికీ అభివృద్ది పనులు మాత్రం జరగలేదు శ్రీ వారి బ్రహ్మోత్సవాలకు అమల్లోకి తెస్తాం తెస్తాం అని ఉత్తర కుమార పలుకులు పలుకుతున్నారు. ఇదేం అని ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. 
            తిమ్మమాంబ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో తీసుకుంటున్నాం అని గ్రామస్థులకు, ఆలయ కమిటీ సభ్యులకు ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని,లేనిపక్షంలో స్థానికంగా ఏర్పాటు చేసిన అఖిలపక్షం వారు తీసుకొనే నిర్ణయానికి జనసేనపార్టీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, గూటిబైలు గ్రామ ప్రజల వెన్నంటి ఉంటామని భైరవ ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జన సేన పార్టీ మండల కన్వీనర్ మేకల చెరువు చౌదరి,సర్పంచ్ విష్ణుమూర్తి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, మాజీ వైస్ ఎంపీపీ వెంకటనారాయన,జనసేన జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ్, ఎర్రంశెట్టి రమేష్,హరి, రాయల్ పీపుల్ ఫ్రంట్ మండల కన్వీనర్లు పసుపులేటి హరి,ఉలింజల మహేశ్వర్,తిమ్మమ్మ వంశీకులు సభ్యులు భక్తవత్సలము,భాస్కర్, గంగిరెడ్డి,రాజ శేఖర్,గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పెద్దయెత్తున పాల్గొని తిమ్మమ్మ ను అన్యుల పాలుకాకుండా రక్షించుకునేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way