కదిరి ( జనస్వరం ) : రైతు దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం, కదిరి నియోజక వర్గం ఇంచార్జ్ భైరవ ప్రసాద్ గారి సూచనల మేరకు రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి నేరుగా గ్రామాల్లో జనసేన నాయకులు వెళ్లారు. రైతులు వద్దకే జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని చెప్పినందున తలుపుల మండలం వద్దకు వెళ్ళి ఆ రైతులు పడుతున్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలని ఉద్దేశంతో రైతు భరోసా కింద ఇస్తున్నటువంటి 13500 తాము పంటలు పండించుకోవడానికి ఏ మాత్రం సరిపోలేదని, అకాల వర్షాల కారణంగా పండించిన పంట చేతికి అందడం లేదని, ఒకవేళ చేతికి వచ్చిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించలేదని రైతులు వాపోతున్నారన్నారు. జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల గారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతుల కష్టాలను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హరి బాబు, నరసింహులు, గణేష్, అన్నం జయ వర్ధన్ పాల్గొనటం జరిగింది.