కదిరి ( జనస్వరం ) : జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన జనబాట కార్యక్రమం కదిరి టౌన్ 34 వ వార్డు నందు జరిగిన కార్యక్రమంలో జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జనసేన పార్టీ కదిరి ఇంచార్జ్ భైరవ ప్రసాద్ పాల్గొన్నారు. వారికి స్థానికులు రోడ్లు, వీధిదీపాలు, కాలువలు లేవని, అడగడానికి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే, స్థానిక కౌన్సిలర్ ఎన్నికల సమయంలో వచ్చినారు కానీ ఇంతవరకు మా కాలనీ లోకి రాలేదని స్థానిక ప్రజలు తెలిపారు. ఇక్కడ పాములు ఎక్కువగా తిరుగుతుంటాయని నెల క్రిందట పాము కరచే ఒక ఆమె హాస్పిటల్ పాలు అయిందని రోజు ఏదో ఒక ఇంట్లోకి పాములు వస్తూ ఉంటాయని చెట్లు కంపలు ఎక్కువ అని వాటిని శుభ్రపరిచేవారు లేరని అన్నారు. ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు చెప్పిన పట్టించుకోవట్లేదు అని వాపోయారు. ఇక్కడ కరెంటు స్తంభాలు ఏర్పాటు చేశారు కానీ వీధి దీపాలు లేవని తెలియజేశారు. జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని అలాగే మీ సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. వారు ఒక నెల లోపల అధికారులు కానీ, స్థానిక ఎమ్మెల్యే గాని తీర్చకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిస్తామని చెప్పారు. కాలనీలో వీధి దీపాలను జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. కేవలం వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజలను ఓటర్లుగా మాత్రమే చూస్తూ ఉందని వారి సమస్యల గురించి పట్టించుకోవట్లేదని, ఇది ఇలాగే కొనసాగితే తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వారు తెలియజేశారు. ఈ వార్డులోని కాలనీల సమస్యలు తీర్చే అంతవరకు జనసేన పార్టీ కాలనీవాసులకు తోడుగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పత్తి చంద్రశేఖర్, అబ్దుల్ అలీ, రామాంజనేయులు, తిరుపతేంద్ర, టౌన్ అధ్యక్షులు చలపతి, మండల అధ్యక్షులు మహేష్, kv రమణ, చౌదరి, కుటాల లక్ష్మణ్, 34 వ వార్డు కమిటీ అధ్యక్షులు హరిబాబు, రాజ, చంద్రశేఖర్, సాయికుమార్, గుంతా ప్రతాప్, నరసింహులు, నరేష్, కిరణ్, గణేష్, నరసింహులు, చెన్నకేశవులు, షాను, ఆది, లోకేష్, సాయిప్రియ, ఫయాజ్, శ్రీనివాసులు, భాస్కర్, చక్రధర, రాజేంద్రప్రసాద్, ముజీబ్, హరీష్, ఇనూద్దీన్, వంశీ, వెంకటరమణ, రెడ్డిరాయల్, రమేష్, గోవిందు తదితరులు పాల్గొన్నారు.