కడప ( జనస్వరం ) : మౌలిక వసతులు ఏవి కూడా ఏర్పాటు చేయకుండా జగనన్న కాలనీలో అసంపూర్తిగా ఉన్న ఇల్లులు తామే ఇల్లు కట్టి ఇస్తామన్న ప్రభుత్వం పూర్తిగా మరిచిపోవడం బాధాకరమని కడప ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని దారి మళ్ళించడానికి నిన్న జగనన్న కాలనీ ప్రారంభోత్సవం అని చెప్పి సామర్లకోటలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగత ఆరోపణలు చేసిన విషయం లేని ముఖ్యమంత్రి అని అన్నారు. సొంత జిల్లాలోని ఈ కాలనీ ని చూస్తే ఆయన చేసిన అభివృద్ధి కనబడుతుంది. కనీసం తాగునీరు డ్రైనేజీ వ్యవస్థ రోడ్ల నిర్మాణం ఏమీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక్క లక్ష 80 వేల రూపాయల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని చెప్పడంతో ఆగిపోయిన ఇల్లులు పునాదుల వరకే కొన్ని గోడల వరకు కొన్ని ఇల్లులు అక్కడక్కడ డబ్బులు ఉన్నవాళ్లు ఒకటి రెండు ఇల్లు పూర్తి చేసుకున్న నివసించడానికి సౌకర్యం లేక ఖాళీగా ఉన్నాయని అన్నారు. మరి కొన్ని స్థానిక అధికార పార్టీ నాయకులే దళారీల అవతారం ఎత్తి లబ్ధిదారులకు చిన్న మొత్తం ఇచ్చి మరొకరికి అమ్మేశారు. అప్పట్లో స్థానిక ఎమ్మెల్యే మరియు అధికార పార్టీ నాయకులు ఆర్భాటంగా ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం ప్రారంభించి ఇది ఒక జగనన్న కాలనీ కాదు జగనన్న ఊరు అని చెప్పి ఇదే అభివృద్ధి అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సుంకర శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి సురేష్ బాబు, మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కోఆర్డినేటర్ పండ్రా రంజిత్ కుమార్, పత్తి విస్సు, బోరెడ్డి నాగేంద్ర, శేషు రాయల్, గజ్జల సాయి, లోకేష్, వినయ్, తదితరులు పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com