కడప ( జనస్వరం ) : పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ జనసేన రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కడప కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధ్యక్షా కరెంట్ బిల్లు ముట్టుకొంటే షాక్ తగులుతుంది 500 రూపాయల బిల్లు వస్తే పేదవారు ఎలా కట్టగలరు అన్న జగన్ రెడ్డి ఈరోజు సగటు పేద, మధ్యతరగతి వారి విద్యుత్ చార్జీలను 30% వరకు పెంచారు. ధనార్జనే ధ్యేయంగా వచ్చినట్టు వైసీపీ ప్రభుత్వం అనిపిస్తుంది. ఉదయాన్నే లేస్తే పన్ను విధిస్తారు. ఏ విధంగా ప్రజల నుంచి డబ్బులు లాగేసుకుంటారా అని ప్రజలు భయపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు మాలే శివ, రాష్ట్ర కార్యదర్శి ముకరం చాంద్, శివ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.