
కడప, (జనస్వరం) : గరికపాటి చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను ఉమ్మడి కడప జిల్లా చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు మాదాస్ నరసింహ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతవరకు మాకు గరికపాటి మీద గౌరవం భక్తి విశ్వాసం ఉండేది. కానీ ఆయన హైదరాబాద్ ప్రోగ్రాంలో చేసిన స్కూలు పిల్లడు చేష్టలను చూస్తే ఇంత నీచుడా ఇంత సహనం లేనోడా ఇంత పిరికివాడా అని మాకు అనిపిస్తుందని అన్నారు. గరికపాటి ప్రవచనాలు మాకు ఇష్టమే. చిరంజీవి ఒక సామాన్యమైన వ్యక్తి కాదు అదొక శక్తి ఆయన కోసం సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడుతున్న మన మహిళ అభిమానులు కానీ వారిని కాదనకుండా మనసు నొప్పించకుండా చిరంజీవి సెల్ఫీలకు ఓకే చెప్పారు. ఇంత చిన్న విషయాన్ని దుష్ట గరకపాటి జీర్ణించుకోకుండా అహంకారముతో కొవ్వెత్తిన ఆంబోతుల మాట్లాడడం చూస్తే సహనం కూడా లేనివాడు ప్రవచనాలు చెప్పడానికి ఎందుకు పనికొస్తాడు చిరంజీవి మంచితనం మానవత్వంతో ఆయన స్ఫూర్తితో గరికపాటి నా నోటితో ఏమని లేక పోతున్నాను. గరికపాటి వస్తే చిరంజీవి ఎంతో ఆప్యాయంగా పలకరించారు. కానీ చిరంజీవి ఎదుగుదల చూసి తట్టుకోలేక గరికపాటి నిజస్వరూపం బయటపెట్టాడు. ఇలాంటి కుక్కలు ఎన్ని మొరిగిన మెగా ఫ్యామిలీకి ఒరిగేది ఏమీ లేదని మాదాస్ నరసింహ అన్నారు. మెగా అభిమానులు మనోభావాలు గాయపడేలా మాట్లాడిన గరికపాటి త్వరలోనే గరికపాటి గరికతినే అవకాశం ఉంది. ఇలాగే మాట్లాడిన కమ్యూనిస్టు పార్టీ నేత నారాయణ తర్వాత తన తప్పును తెలుసుకొని వెంటనే చిరంజీవికి క్షమాపణ చెప్పారు. గరికపాటి కూడా వెంటనే క్షమాపణ చెప్పాలని లేకపోతే గరికపాటిని అడ్డుకుంటామని మాదాస్ నరసింహ హెచ్చరించారు.