విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ స్థానిక డివిజన్ అధ్యక్షులు బత్తుల. వెంకటేష్ , రెడ్డిపల్లి గంగాధర్, పొట్నూరి శ్రీనివాస్ రావు లతో కలిసి కేటీ రోడ్డును సందర్శించినారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ K. T రోడ్డు నిర్మాణం ఎప్పటికీ పూర్తవుతుందోనని,స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి విఎంసి అధికారులకి జనసేన పార్టీ బ్యానర్లు తొలగించడం పై ఉన్న దృష్టి కేటీ రోడ్డు నిర్మాణంపై లేదని, రోజుకు ఒక గజం రోడ్డు వేసిన ఈపాటికి ఎప్పుడో పూర్తి అయి ఉండేదని, బస్సులు అంబులెన్స్ తిరిగి ఏడాది కాలమైందని, స్కూల్ పిల్లలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రోజువారి పనులు చేసుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యాక్సిడెంట్ల విపరీతంగా జరుగుతున్నాయని, KT రోడ్డు మీద వ్యాపారాలు నిల్ బార్ల వ్యాపారాలు ఫుల్ అని, కేటీ రోడ్డు కళావిహీనంగా మారిందని, కేటి రోడ్డు మీద టూలేట్ బోర్డులు విపరీతంగా కనబడుతున్నాయని అన్నారు. రెండేళ్ల నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరియు విఎంసి అధికారులు ఒక ప్రధాన రోడ్డు నిర్మాణం పూర్తి చెయ్యలేకపోయారని,KT రోడ్డు పూర్తిస్థాయిలో ఎప్పటికీ పూర్తయి ప్రజలకు అందుబాటులో వస్తుందో ఆ భగవంతుడికే తెలియాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత డివిజన్ అధ్యక్షులు ఆకుల రవిశంకర్, నగర కమిటీ నాయకులు మొబీనా సబిన్కర్.నరేష్, నాయకులు హనుమాన్, పిల్లా శ్రీకాంత్, పులి చేరి రమేష్ , అగ్రహారపు రాజు,దాసిన జగదీష్, బావిశెట్టి శ్రీను, శివ ఆది, పవన్ కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.